చంద్రబాబుకు ఇంటిబెంగ!
ఓటుకు కోట్లు కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ నోటీసులిస్తుందా….? పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయా.. అనే సమస్యలకన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మరో సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఆయనకు ఇంటిబెంగ పట్టుకుంది. సందర్శకులకు సరిపోవడంలేదన్న కారణంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో తన పాత ఇంటిని కూలగొట్టిన చంద్రబాబు అక్కడ మరింత విశాలంగా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయన సమర్పించిన ఇంటిప్లాన్ జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా వుండడంతో ఆయన ఇల్లు నిర్మాణానికి అవసరమైన […]
ఓటుకు కోట్లు కుంభకోణంలో తెలంగాణ ఏసీబీ నోటీసులిస్తుందా….? పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు వస్తాయా.. అనే సమస్యలకన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును మరో సమస్య ఎక్కువగా వేధిస్తోంది. ఆయనకు ఇంటిబెంగ పట్టుకుంది. సందర్శకులకు సరిపోవడంలేదన్న కారణంతో హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 65లో తన పాత ఇంటిని కూలగొట్టిన చంద్రబాబు అక్కడ మరింత విశాలంగా కొత్త ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు. అయితే ఆయన సమర్పించిన ఇంటిప్లాన్ జీహెచ్‌ఎంసీ నిబంధనలకు విరుద్ధంగా వుండడంతో ఆయన ఇల్లు నిర్మాణానికి అవసరమైన అనుమతులను హైదరాబాద్ కమిషనర్ సోమేష్ కుమార్ ఇవ్వడం లేదట. సోమేష్‌కుమార్ అధికారిలా కాకుండా టీఆర్ ఎస్ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నారని మంత్రి అచ్చన్నాయుడు మండిపడ్డారు. చంద్రబాబు ఇంటికి అనుమతులివ్వకుండా ముందు ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి ఆస్తిపన్ను కట్టండి అని కమిషనర్ అడుగుతున్నారని అచ్చన్నాయుడు ఆరోపిస్తున్నారు. దీనిపై కమిషనర్ స్పందిస్తూ ప్రతిదాన్నీ వివాదాస్పదం చేయవద్దని నిబంధనల ప్రకారం ప్లాన్ సమర్పిస్తే అనుమతిస్తామని చెప్పారు.