కేసీఆర్ ప్రలోభాలకు ఆధారాలున్నాయి : వివేక్
టీఆర్ఎస్ కుట్రపూరితంగా మాపై కేసులు పెట్టి ఇరికించిందని టీటీడీపీ ఎమ్మెల్యే వివేక్ ఆరోపించారు. టీటీడీపీ నేతలు ఏసీబీ డీజీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు తమని ప్రలోభపెట్టారని అన్నారు. టీఆర్ఎస్లో చేరకుంటే తమ నియోజకవర్గ అభివృద్ధి జరగదని బెదిరించింది వాస్తవం కాదా? ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? అని వివేక్ ప్రశ్నించారు. సండ్ర వెంకట వీరయ్యను గంప గోవర్థన్ బెదిరించారని వివేక్ ఆరోపించారు. సీఎం […]
టీఆర్ఎస్ కుట్రపూరితంగా మాపై కేసులు పెట్టి ఇరికించిందని టీటీడీపీ ఎమ్మెల్యే వివేక్ ఆరోపించారు. టీటీడీపీ నేతలు ఏసీబీ డీజీని కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం వివేక్ మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు తమని ప్రలోభపెట్టారని అన్నారు. టీఆర్ఎస్లో చేరకుంటే తమ నియోజకవర్గ అభివృద్ధి జరగదని బెదిరించింది వాస్తవం కాదా? ఆఫర్ ఇచ్చింది నిజం కాదా? అని వివేక్ ప్రశ్నించారు. సండ్ర వెంకట వీరయ్యను గంప గోవర్థన్ బెదిరించారని వివేక్ ఆరోపించారు. సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావుపై కేసు పెట్టామని, లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశామని, రేవంత్‌రెడ్డిపై తీసుకున్న చర్యలే వీరిపై కూడా తీసుకోవాలని వివేక్ డిమాండ్ చేశారు.