Telugu Global
Others

బైక్ రైడ‌ర్ల‌కు అర్ధ న‌గ్న శిక్ష‌లు

తమిళనాడులో ద్విచక్ర వాహనదారుల‌కు హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని మద్రాసు హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులు తలకెక్కించుకోవడం లేదు. దీంతో తమిళనాడు పోలీసులు… ఉల్లంఘనులపై సరికొత్త అస్త్రం ప్రయోగించారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది బైకు రైడర్ల బట్టలిప్పించి డ్రాయర్లతో 9 గంటల పాటు నిర్బంధించారు. మితిమీరిన వేగంతో మహాబలిపురం టౌన్‌లోకి వస్తున్న వీరిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. 19 నుంచి 25 మధ్య వయసున్న వీరిని అదుపులోకి తీసుకుని […]

తమిళనాడులో ద్విచక్ర వాహనదారుల‌కు హెల్మెట్ పెట్టుకుని సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని మద్రాసు హైకోర్టు ఎన్నిసార్లు చెప్పినా వాహనదారులు తలకెక్కించుకోవడం లేదు. దీంతో తమిళనాడు పోలీసులు… ఉల్లంఘనులపై సరికొత్త అస్త్రం ప్రయోగించారు. నిబంధనలు ఉల్లంఘించిన 14 మంది బైకు రైడర్ల బట్టలిప్పించి డ్రాయర్లతో 9 గంటల పాటు నిర్బంధించారు. మితిమీరిన వేగంతో మహాబలిపురం టౌన్‌లోకి వస్తున్న వీరిని ఆదివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో పోలీసులు పట్టుకున్నారు. 19 నుంచి 25 మధ్య వయసున్న వీరిని అదుపులోకి తీసుకుని బట్టలిప్పించి 9 గంటల పాటు పోలీసు స్టేషన్లో ఉంచారు. అంతేకాకుండా ఒక్కొక్కరికి రూ.1200 జరిమానా కూడా విధించారు. వారి నుంచి స్వాధీనం చేసుకున్న హైఎండ్ బైకులు ఒకరోజు స్టేషన్ లోనే ఉంచారు. పోలీసుల చర్యను మానవ హక్కుల కార్యకర్తలు తప్పుబట్టినా ఉల్లంఘనులకు కళ్లెం వేసేందుకు అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటామని పోలీసులు తమ చర్యని సమర్థింకున్నారు.
First Published:  16 Jun 2015 1:10 PM GMT
Next Story