Telugu Global
Others

రేవంత్‌ కేసులో దర్యాప్తు అధికారి మార్పు

రేవంత్‌రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని ఏసీబీ అర్థంతరంగా మార్చింది. అత్యంత కీలకమైన ఈ కేసుకు ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి సారథ్యం వహించగా ఇకపై అదనపు ఎస్పీ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న మల్లారెడ్డిని ఏసీబీకి బదిలీ చేసి ఓటుకు నోటు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లోనూ కేసు దర్యాప్తును సమర్థతతో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన వారిని ఏసీబీలో పోస్టింగ్‌ ఇచ్చారు. సీఐడీలో […]

రేవంత్‌రెడ్డి కేసును దర్యాప్తు చేస్తున్న అధికారిని ఏసీబీ అర్థంతరంగా మార్చింది. అత్యంత కీలకమైన ఈ కేసుకు ఇప్పటి వరకు డీఎస్పీ స్థాయి అధికారి సారథ్యం వహించగా ఇకపై అదనపు ఎస్పీ ఆ బాధ్యతలను నిర్వర్తించనున్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా అదనపు ఎస్పీగా ఉన్న మల్లారెడ్డిని ఏసీబీకి బదిలీ చేసి ఓటుకు నోటు కేసు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల జరిగిన ఐపీఎస్‌ల బదిలీల్లోనూ కేసు దర్యాప్తును సమర్థతతో ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన వారిని ఏసీబీలో పోస్టింగ్‌ ఇచ్చారు. సీఐడీలో ఉన్న చారుసిన్హాను బదిలీపై ఏసీబీ డైరెక్టర్‌గా నియమించారు. కరీంనగర్‌ ఎస్పీగా ఉన్న వి.శివశంకర్‌ను పదోన్నతిపై ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమించారు. శివశంకర్‌కు సాంకేతిక పరిజ్ఞానంపైౖ గట్టిపట్టు ఉండటం వల్లే ఇక్కడికి మార్చారన్న ప్రచారం జరుగుతోంది. రేవంత్‌, సహ నిందితుల్ని అరెస్ట్‌ చేసిన సమయంలో తీసిన వీడియో ఫుటేజీలు, వాడిన సాంకేతిక పరిజ్ఞానం విషయంలో కోర్టులో సమర్థంగా వాదనలు వినిపించేందుకు వీలుగానే శివశంకర్‌ను ఏసీబీకి తెచ్చినట్లు సమాచారం.

First Published:  16 Jun 2015 6:34 PM IST
Next Story