12వ తరగతికి ‘లోరియల్ ’ స్కాలర్‌షిప్
‘ప్రపంచానికి సైన్స్ కావాలి.. సైన్స్‌కి మహిళలు కావాల’నే తమ నమ్మకానికి అనుగుణంగా లోరియల్ ఇండియా 12వ తరగతి పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ చేయబోతున్న యువతకు స్కాలర్‌షిప్‌లను అందించటానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తుంది. తమ ‘ఫర్ యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్’ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా 50మందికి 2.5 లక్షల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్ మంజూరు చేయనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో గుర్తింపు పొందిన కాలేజీ లేదా వర్శిటీ లో సైన్స్ రంగంలో నాలుగేళ్ల కోర్సు […]
BY sarvi16 Jun 2015 6:36 PM IST
sarvi Updated On: 17 Jun 2015 11:53 AM IST
‘ప్రపంచానికి సైన్స్ కావాలి.. సైన్స్‌కి మహిళలు కావాల’నే తమ నమ్మకానికి అనుగుణంగా లోరియల్ ఇండియా 12వ తరగతి పూర్తి చేసుకుని గ్రాడ్యుయేషన్ చేయబోతున్న యువతకు స్కాలర్‌షిప్‌లను అందించటానికి అప్లికేషన్లు ఆహ్వానిస్తుంది. తమ ‘ఫర్ యంగ్ ఉమెన్ ఇన్ సైన్స్’ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్‌లో భాగంగా 50మందికి 2.5 లక్షల రూపాయల చొప్పున స్కాలర్‌షిప్ మంజూరు చేయనున్నట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. భారతదేశంలో గుర్తింపు పొందిన కాలేజీ లేదా వర్శిటీ లో సైన్స్ రంగంలో నాలుగేళ్ల కోర్సు చేయటం కొరకు ఈ స్కాలర్‌షి ప్‌ని అందించనున్నారు. ఇటీవల 12వ తరగతి పూర్తి చేసుకుని కనీసం 85 శాతం మార్కులు సాధించటంతో పాటుగా 19 యేళ్లు దాటని యువతులు ఈ స్కాలర్‌షిప్‌ల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జూలై 10వ తేదీ లోపుగా తమకు అప్లికేషన్‌లు చేరాల్సి ఉందని, అ ప్లికేషన్లు, ఇతర వివరాలను వెబ్‌సైట్‌లో పొందవచ్చని సంస్థ వెల్లడించింది.
Next Story