మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎంపై అవినీతి కేసు
అవినీతికర చర్యలతో జగన్ బుజ్‌బల్ వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఆయనకు నాసిక్‌లో ఐదు బంగ్లాలు, ముంబైలో 12 షాపులు, పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. థానేలో పెద్ద బంగ్లా ఉంది. వీటన్నింటికి మించి పూణెలోని లోనావాలలో 65 ఎకరాల విస్తీర్ణంలో బంగ్లా, అందులో హెలీప్యాడ్, నాలుగు నగరాల్లో వందల కోట్ల స్థిరాస్తులు… ఇది మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జగన్ బుజ్‌బల్ సంపద. ఈడీ ఆయనకు ఇంకేమైనా ఆస్తులున్నాయా అనే విషయమై […]
అవినీతికర చర్యలతో జగన్ బుజ్‌బల్ వందల కోట్ల రూపాయలు సంపాదించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది. ఆయనకు నాసిక్‌లో ఐదు బంగ్లాలు, ముంబైలో 12 షాపులు, పలు ప్రాంతాల్లో ఫ్లాట్లు ఉన్నాయి. థానేలో పెద్ద బంగ్లా ఉంది. వీటన్నింటికి మించి పూణెలోని లోనావాలలో 65 ఎకరాల విస్తీర్ణంలో బంగ్లా, అందులో హెలీప్యాడ్, నాలుగు నగరాల్లో వందల కోట్ల స్థిరాస్తులు… ఇది మహారాష్ట్ర మాజీ డిప్యూటీ సీఎం జగన్ బుజ్‌బల్ సంపద. ఈడీ ఆయనకు ఇంకేమైనా ఆస్తులున్నాయా అనే విషయమై ఆరా తీస్తోంది. ఇప్పటికే కేసు నమోదు చేసింది. నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీకి చెందిన జగన్ బుజ్‌బల్ గతంలో మహారాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రిగా పని చేశారు. ఇప్పుడు ఈడీ ఆయనపై రెండు కేసులు నమోదు చేసింది. ఆయన ఇంటిపై ఈడీ దాడులు చేయడంతో పాటు మనీ లాండరింగ్ అభియోగాలు నమోదు చేసింది. జగన్ బుజ్‌బల్‌పై ఏప్రిల్ నెలలో ముంబై హైకోర్టులో కేసు నమోదు అయింది. ఆయన అవినీతికి పాల్పడినట్లు ఆధారాలు ఉన్నట్లు కోర్టు నిర్ధారించింది. మరోవైపు జగన్ బుజ్‌బల్ ఇంట్లో దాడులకు రాజకీయాలతో సంబంధం లేదని కోర్టు ఉత్తర్వుల ప్రకారమే చర్యలు తీసుకుంటున్నారని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర పడ్నవీస్ తెలిపారు.