బాహుబలి ఆడియో సో సో...!
దక్షిణాదిన ఇప్పుడు అంతా బాహుబలి మేనియా నడుస్తుందంటే ఆశ్చర్యం కాదు. వచ్చెనెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ , హింది లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియో వినడానికి అంత ఊపు ఇచ్చేదిగా లేదనే టాక్ వినిపిస్తుంది. మొదటి భాగంలో మొత్తం 8 పాటలున్నాయి. అయితే రెగ్యులర్ కమర్షయిల్ చిత్రాల సాంగ్స్ మాదిరి అనిపించడం లేదు. కానీ కథ పరంగా పిక్యరైజేషన్ తో చూస్తున్నప్పుడు ఔర అనిపించడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్. […]
దక్షిణాదిన ఇప్పుడు అంతా బాహుబలి మేనియా నడుస్తుందంటే ఆశ్చర్యం కాదు. వచ్చెనెల 10న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ , హింది లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతున్న ఈ చిత్రం ఆడియో వినడానికి అంత ఊపు ఇచ్చేదిగా లేదనే టాక్ వినిపిస్తుంది. మొదటి భాగంలో మొత్తం 8 పాటలున్నాయి. అయితే రెగ్యులర్ కమర్షయిల్ చిత్రాల సాంగ్స్ మాదిరి అనిపించడం లేదు. కానీ కథ పరంగా పిక్యరైజేషన్ తో చూస్తున్నప్పుడు ఔర అనిపించడం ఖాయం అంటున్నారు చిత్ర యూనిట్.
ఇదొక పిరియాడిక్ చిత్రం లాంటిది కావడంతో.. రెగ్యులర్ మసాల సాంగ్స్ లేవు. అయితే కేవలం దీని బేస్ చేసుకుని సినిమా ను జడ్జ్ చేయడం కూడా కరెక్ట్ కాదు. పాటలు వినడానికి కూడా టైటిల్ సాంగ్ చాల బావుంది. రౌద్రం, భయనక రసాలు ప్రధానంగా వస్తున్న బాహుబలి చిత్రం లో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లు లీడ్ రోల్స్ చేశారు. కీరవాణి సంగీతం అందించారు. టోటల్ గా బాహుబలి పాటలు వినడానికి మాత్రం సోసో గానే వున్నాయనేది మెజార్టీ ఆడియన్స్ నుంచి వినిపిస్తున్న టాక్. అయితే సినిమా విడుదలైన తరవాత ఓపినియన్స్ మారిపోవచ్చు .