Telugu Global
Others

ఉద్యోగుల తరలింపు ప్రక్రియకు శ్రీకారం

తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల తరలింపుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మరోఅడుగు ముందుకు వేసింది. దశలవారీగా తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర మాట్లాడారు. తరలింపు ప్రక్రియను దశలవారీగా ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముందుగా ఎంతమందిని, ఏయే శాఖల నుంచి తరలించాలనే అంశంపై ప్రభుత్వం అవగాహనకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు. […]

తాత్కాలిక రాజధానికి ఉద్యోగుల తరలింపుకు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం మరోఅడుగు ముందుకు వేసింది. దశలవారీగా తరలివెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ ప్రక్రియలో భాగంగా ఏపీ ఎన్జీవో అసోసియేషన్‌ అధ్యక్షుడు అశోక్‌బాబుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి సతీష్‌చంద్ర మాట్లాడారు. తరలింపు ప్రక్రియను దశలవారీగా ప్రారంభించేందుకు సహకరించాలని కోరారు. ముందుగా ఎంతమందిని, ఏయే శాఖల నుంచి తరలించాలనే అంశంపై ప్రభుత్వం అవగాహనకు వస్తే తాము సిద్ధంగా ఉన్నామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టంచేశారు. తొలిదశలో ప్రజలకు అవసరమైన శాఖలను తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జలవనరులశాఖ నుంచి 75మంది ఉద్యోగులు వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. తొలిదశలో మత్స్య, రెవెన్యూ, వ్యవసాయ, సాంఘిక సంక్షేమం, దేవాదాయ, వైద్య, ఆరోగ్య శాఖలను తరలించాలని నిర్ణయించారు. ఆయా శాఖల్లో ఉద్యోగులను కొంతమంది విజయవాడ, గుంటూరుకు తరలించేందుకు ఎవరైతే ముందుకు వస్తారో వారిని వెంటనే పంపించాలని చంద్రబాబు సూచించారు. ఆంధ్రప్రదేశ్‌ తాత్కాలిక రాజధానికి తరలివెళ్లే ఉద్యోగులకు హెచ్‌ఆర్‌ఏ పెంచి ఇస్తామని చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలకు హామీ ఇచ్చారు. అవసరమైతే ఇంటి అద్దె కూడా చెల్లిస్తామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి నేరుగా చెప్పడంతో నిన్నమొన్నటివరకు సంశయించిన ఉద్యోగ సంఘాల నేతలు కాదనలేకపోయారు. ఎప్పటికైనా తరలి రావాల్సిందేనని ఉద్యోగులు ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.
First Published:  16 Jun 2015 6:38 PM IST
Next Story