అల్లరి నరేష్ భార్యా బాధితుడా ?
అల్లరి నరేష్ హీరోగా, సాక్షి చౌదరీ హీరోయిన్ గా మచ్చ సాయికిషోర్ దర్శకత్వంలో, రాంబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం జేమ్స్ బాండ్. ఈ సినిమాలో హీరోయిన్ ఒక మాఫీయా డాన్ రోల్లో నటించారని, అమాయకమైన భర్తగా అల్లరి నరేష్ నవ్వులు పూయిస్తాడని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. భార్య భాదలు భరించలేక అల్లరి నరేష్ ఇంటినుండి కూడా పారిపోతాడని సమాచారం. సినిమా మొదటి నుండి చివరి వరకు ఆద్యంతం అల్లరి నరేష్ నవ్వులు పూయిస్తాడని, ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ […]
BY admin17 Jun 2015 9:46 AM IST
X
admin Updated On: 17 Jun 2015 10:03 AM IST
అల్లరి నరేష్ హీరోగా, సాక్షి చౌదరీ హీరోయిన్ గా మచ్చ సాయికిషోర్ దర్శకత్వంలో, రాంబ్రహ్మం నిర్మిస్తున్న చిత్రం జేమ్స్ బాండ్. ఈ సినిమాలో హీరోయిన్ ఒక మాఫీయా డాన్ రోల్లో నటించారని, అమాయకమైన భర్తగా అల్లరి నరేష్ నవ్వులు పూయిస్తాడని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. భార్య భాదలు భరించలేక అల్లరి నరేష్ ఇంటినుండి కూడా పారిపోతాడని సమాచారం. సినిమా మొదటి నుండి చివరి వరకు ఆద్యంతం అల్లరి నరేష్ నవ్వులు పూయిస్తాడని, ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్ లో ఓ మైలు రాయిలాగా మిగిలిపోయే సినిమా అని చెపుతున్నారు. హిట్లు లేక కొట్టుమిట్టాడుతున్న అల్లరోడికి ఈ సినిమా హిట్ కావాలని కోరుకుందాం.
Next Story