ఓటుకు నోటు కేసులో సండ్ర, వేం లకు సీబీఐ నోటీసులు
ఓటుకు నోటు కేసులో సీబీఐ తొలి విడత నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఈ అంశంపై సండ్ర మీడియాతో ఫోన్‌లో మాట్టాడుతూ… తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. […]
ఓటుకు నోటు కేసులో సీబీఐ తొలి విడత నోటీసులు జారీ చేసింది. 160 సీఆర్‌పీసీ సెక్షన్ కింద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఏసీబీ అధికారులు హైదర్‌గూడలోని సండ్ర వెంకట వీరయ్య ఇంటికి వెళ్లారు. అయితే ఆయన ఇంట్లో అందుబాటులో లేకపోవడంతో అధికారులు అక్కడి నుంచి వెనుదిరిగారు. కాగా ఈ అంశంపై సండ్ర మీడియాతో ఫోన్‌లో మాట్టాడుతూ… తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. నోటీసులు అందితే దానికి సమాధానం చెబుతానన్నారు. ఇదిలా ఉండగా.. ఓటుకు నోటు కేసులో వేం నరేందర్ రెడ్డికి కూడా ప్రమేయం ఉన్నట్లు ఏసీబీ భావిస్తోంది. ఏసీబీ అధికారులు నోటీసులు పట్టుకుని మరో టీటీడీపీ నేత నరేందర్ రెడ్డి ఇంటివద్దకు వెళ్లారు. నరేందర్ రెడ్డి ప్రమేయమున్నట్లు ప్రాథమికంగా గుర్తించిన ఏసీబీ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి నోటీసులు అందజేశారు.