Telugu Global
Others

గ్రేటర్‌లో 106 స్కూలు బస్సులపై కేసులు

గ్రేటర్‌ పరిధిలో పలు విద్యా సంస్థల బస్సులపై రవాణాశాఖ ప్రత్యేక నిఘా వేసింది. 16 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అధికారులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూలు బస్సులను తనిఖీ చేస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే 106 స్కూలు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి తీసుకురావద్దని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పది బృందాలు విద్యా సంస్థల బస్సులను […]

గ్రేటర్‌ పరిధిలో పలు విద్యా సంస్థల బస్సులపై రవాణాశాఖ ప్రత్యేక నిఘా వేసింది. 16 ప్రత్యేక బృందాలతో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల పరిధిలో అధికారులు ఉదయం, సాయంత్రం వేళల్లో స్కూలు బస్సులను తనిఖీ చేస్తున్నారు. మంగళవారం ఒక్క రోజే 106 స్కూలు బస్సులపై కేసులు నమోదు చేశారు. ఫిట్‌నెస్‌ లేని బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్లపైకి తీసుకురావద్దని ఆర్టీఏ అధికారులు హెచ్చరిస్తున్నారు. హైదరాబాద్‌ జిల్లా పరిధిలో ఉదయం, సాయంత్రం వేళల్లో పది బృందాలు విద్యా సంస్థల బస్సులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాయని జెటీసీ టి.రఘునాథ్‌ తెలిపారు. ఫిట్‌నెస్‌తో పాటు స్కూలు బస్సులో విద్యార్థులకు అనుగుణంగా ఏర్పాట్లు ఉన్నాయా లేదా, డ్రైవర్‌ అన్ని విధాలుగా అర్హుడేనా అన్న విషయాలను వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు తనిఖీ చేస్తున్నారు. బస్సుల్లో వైద్యచికిత్స కోసం అవసరమ్యే పస్ట్‌ ఎయిడ్‌ కిట్‌ లేని వాటిపైనా కేసులు నమోదు చేస్తున్నామని తెలిపారు.
First Published:  16 Jun 2015 1:07 PM GMT
Next Story