జర నవ్వండి ప్లీజ్ 115
డాక్టర్ విపరీతంగా లావున్న తన పేషెంట్‌కి ఒక హార్లిక్స్ బాటిలంత పెద్దగా ఉన్న బాటిల్‌లో నిండుగా టాబిలెట్లు ఇచ్చి “ఇవి తినడానికి కాదు. వాటిని రోజుకు మూడుసార్లు కిందపోసి వాటిని ఏరి బాటిల్లో వెయ్యి” అని సలహా ఇచ్చాడు. ————————- కామరాజ్ నాడార్ ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు. ఒక సందర్భంలో ప్రధాని నెహ్రూను కలిసాడు. నెహ్రూ “మీరు లుంగీలు ఎందుకు కట్టుకుంటారు” అని నెహ్రూ అడిగాడు. కామరాజ్ “లుంగీల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బాత్‌రూంకు వెళ్ళినప్పుడు […]
డాక్టర్ విపరీతంగా లావున్న తన పేషెంట్‌కి ఒక హార్లిక్స్ బాటిలంత పెద్దగా ఉన్న బాటిల్‌లో నిండుగా టాబిలెట్లు ఇచ్చి
“ఇవి తినడానికి కాదు. వాటిని రోజుకు మూడుసార్లు కిందపోసి వాటిని ఏరి బాటిల్లో వెయ్యి” అని సలహా ఇచ్చాడు.
————————-
కామరాజ్ నాడార్ ప్రసిద్ధ కాంగ్రెస్ నాయకుడు. ఒక సందర్భంలో ప్రధాని నెహ్రూను కలిసాడు. నెహ్రూ “మీరు లుంగీలు ఎందుకు కట్టుకుంటారు” అని నెహ్రూ అడిగాడు. కామరాజ్ “లుంగీల వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. బాత్‌రూంకు వెళ్ళినప్పుడు చాలా అనుకూలం. పడుకున్నప్పుడూ ఫ్రీగా పడుకోవచ్చు. ఇట్లా లుంగీ అనుకూలాల గురించి వివరించాడు.
అప్పటితో చర్చ ముగిసింది.
నెహ్రూగారు లుంగీలంటే ఇష్టపడుతున్నట్లు భావించిన కామరాజ్ నెహ్రూగారి కోసం పదిహేను ప్రశస్తమయిన లుంగీలు మద్రాసునించి పంపాడు.
నెహ్రూ తనకు అందిన లుంగీలు తిప్పి పంపుతూ
“లుంగీలు దక్షిణ భారతదేశీయులకు అనుకూలంగా ఉంటాయి. నేను లుంగీ కట్టుకున్నాననుకో శీర్షాసనం వెయ్యాలంటే ఎంత ఇబ్బంది” అని రాశాడు.
————————————–
సబ్ ఎడిటర్ల కోసం ఇంటర్వ్యూ జరుగుతోంది.
సంపాదకుడు ప్రశ్నలు వేస్తున్నాడు. సబ్ ఎడిటర్ సమాధానమిస్తున్నాడు.
“బెస్ట్ క్రికెటర్ ఎవరు?” – “అజరుద్దీన్”
అంటార్కిటాకు వెళ్ళిన మొదటి ఇండియన్ – జడ్.ఎ. ఖాసిం
“అగ్ని” డిజైనర్ – అబ్దుల్ కలాం
టెన్నిస్ ఛాంపియన్ – జీషాన్ అలీ
ఆసియా స్నూకర్ ఛాంపియన్ – యాసిన్ రిజా మర్చెంట్
బుక్కర్ ప్రైజ్ వచ్చిన ఇండియాలో పుట్టిన రచయిత?-సల్మాన్ రిష్దీ
ఇప్పుడు ఆయా రంగాల్లో ప్రముఖుల గురించి
హాకీ – మొహమ్మద్ షాహిద్
కవిత్వం – ఆలీ సర్దార్ జాఫ్రీ
నటన – నసిరుద్దీన్ షా
ఎనాటమీ – అబిద్ హుసేన్
చరిత్ర – ఇర్ఫాన్ హబీబ్
జర్నలిజం – యమ్.జె.అక్బర్
ప్రశ్నలకు వచ్చే సమాధానాలు చూసి సంపాదకుడు కాసేపు ఆగి “అందరూ ముస్లింలే! హిందూ దేశంలో హిందువులేం చేస్తున్నారు?” అని అడిగాడు.