Telugu Global
Others

మ‌రో ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్

టాస్క్‌ఫోర్స్‌ పోలీసులనే వాహనంతో ఢీకొట్టేందుకు ప్రయత్నించిన మోస్ట్‌ వాంటెడ్‌, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి డ్రైవర్‌తో పాటు ఏడుగురు అంతర్జాతీయ చందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఎర్రచందనం దుంగలతోపాటు మూడు స్కార్పియో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ వివరించారు. వల్లూరు మండలం టీజీపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో తాడిపత్రి నుంచి బెంగుళూరుకు వెళ్లే మార్గంలో […]

మ‌రో ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
X
టాస్క్‌ఫోర్స్‌ పోలీసులనే వాహనంతో ఢీకొట్టేందుకు ప్రయత్నించిన మోస్ట్‌ వాంటెడ్‌, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్‌ కొల్లం గంగిరెడ్డి డ్రైవర్‌తో పాటు ఏడుగురు అంతర్జాతీయ చందనం స్మగ్లర్లను కడప పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 30 ఎర్రచందనం దుంగలతోపాటు మూడు స్కార్పియో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలను కడప డీఎస్పీ అశోక్‌కుమార్‌ వివరించారు. వల్లూరు మండలం టీజీపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో తాడిపత్రి నుంచి బెంగుళూరుకు వెళ్లే మార్గంలో పది ఎర్ర దుంగలను కేఏ 51 ఎం 2115 స్కార్పియోలో నిందితులు తీసుకెళుతున్నారు. అడ్డగించిన పోలీసులను ఢీకొట్టి పరారయ్యేందుకు ప్రయత్నించారు. పోలీసులు కారును వెంబడించి పట్టుకుని దొంతా వెంకట సాయివరప్రసాద్‌, చమ్మర్తి అమరేంద్రరాజు, నంద్యాల వెంకటరమణను అరెస్టు చేశారు. సీకేదిన్నె మండలం మద్దిమడుగులోని సుగాలి బిడికి అటవీ ప్రాంతాలలో 20 దుంగలను టాటాసుమో, ఓపెల్‌ వాహనంలో లోడ్‌ చేస్తుండగా స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది దాడి చేసి నలుగురిని అరెస్టు చేశారు. వాహనాలు, దుంగల విలువ రూ.50 లక్షలుంటుందని డీఎస్పీ తెలిపారు. మరోవైపు, చెన్నైలోని తాంబరం, థౌజండ్‌ లైట్స్‌, రెడ్‌హిల్స్‌ ప్రాంతాల్లో చిత్తూరు పోలీసులు 10 టన్నుల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ అంతర్జాతీయ స్మగ్లర్‌ అనుచరుడిని కూడా అరెస్టు చేశారు.
First Published:  15 Jun 2015 6:35 PM IST
Next Story