Telugu Global
Others

ఓటుకు నోటులో 'ఐదుగురు'!

ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీ ‘ముఖ్య’ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వేం న‌రేంద్ర‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న‌రావుల నేతృత్వంలో మొత్తం ఈ వ్య‌వ‌హారం జ‌రిగిన‌ట్టు అవినీతి నిరోధ‌క‌శాఖ వ‌ద్ద ఖ‌చ్చిత‌మైన ఆధారాలున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి తెర వెనక  నుంచి వ్యవహారాన్ని నడిపిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేసేందుకు అవినీతి నిరోధక […]

ఓటుకు నోటులో ఐదుగురు!
X
ఓటుకు నోటు కేసుతో తెలుగుదేశం పార్టీ ‘ముఖ్య’ నేతల మెడకు ఉచ్చు బిగుసుకుంటోంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబునాయుడు, ఎమ్మెల్సీగా పోటీ చేసి ఓడిపోయిన వేం న‌రేంద్ర‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, సీఎం ర‌మేష్‌, గ‌రిక‌పాటి మోహ‌న‌రావుల నేతృత్వంలో మొత్తం ఈ వ్య‌వ‌హారం జ‌రిగిన‌ట్టు అవినీతి నిరోధ‌క‌శాఖ వ‌ద్ద ఖ‌చ్చిత‌మైన ఆధారాలున్న‌ట్టు తెలుస్తోంది. మొత్తం మీద టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని రంగంలోకి దించి తెర వెనక నుంచి వ్యవహారాన్ని నడిపిన పెద్ద తలకాయల గుట్టు రట్టు చేసేందుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) స‌మాయ‌త్త‌మ‌వుతోంది. టీడీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌తో సంప్రదింపులు జరిపిన టీడీపీ నేతలందరికీ దశలవారీగా నోటీసులు జారీ చేసి నిర్దేశిత సమయానికి విచారణకు హాజరు కావాలని ఏసీబీ కోరనుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయిన వేం న‌రేందర్‌రెడ్డితోపాటు పార్టీలోని సీనియర్ నేతలు సీఎం రమేశ్, గరికపాటి మోహన్‌రావుతోపాటు ఈ కేసుతో సంబంధమున్న ఇతరులకూ నోటీసులు జారీ చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలుకు ఐదుగురు ప్ర‌ముఖుల‌ను రంగంలోకి దింపినట్లు ఏసీబీ గుర్తించింది. స్టీఫెన్‌సన్‌తోపాటు ఇతర తెలంగాణ ఎమ్మెల్యేలతో వీరు జరిపిన సంప్రదింపులకు సంబంధించిన కాల్ డేటా, వీడియో, ఆడియో టేపులతో ఈ ఐదుగురి ఉనికి వెలుగులోకి వచ్చింది. స్టీఫెన్‌సన్‌కు రూ.50 లక్షల లంచం ముట్టజెప్పి దొరికిపోయిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ముఠా ఇప్పటికే కటకటాల పాలైంది. మిగిలిన న‌లుగురు… వారి వెనుక ఉన్న‌వారి పని పట్టేందుకు ఏసీబీ సిద్ధమైంది. దశలవారీగా నోటీసులు పంపించి వీరంద‌రినీ వేర్వేరుగా విచారించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలో తొలి విడతగా ఒకటి రెండు రోజుల్లో గరికపాటి, సీఎం రమేశ్‌కు నోటీసులిచ్చే అవకాశముంది. ఇక ఈ కేసులో మధ్యవర్తులుగా వ్యవహరించిన మత్తయ్య, సెబాస్టియన్‌కు పలువురు టీటీడీపీ ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు ఫోన్ ద్వారా దిశానిర్దేశం చేసినట్లు ఏసీబీ గుర్తించింది. వారికీ నోటీసులు పంపనుంది. కాగా, ఇప్పటికే రేవంత్‌రెడ్డి గన్‌మన్ వాంగ్మూలాన్ని ఏసీబీ నమోదు చేసింది. అరెస్టుకు మూడు రోజుల ముందు నుంచే రేవంత్ తమను దూరంగా ఉంచారని గన్‌మెన్ తెలిపాడు.
First Published:  16 Jun 2015 8:35 AM IST
Next Story