Telugu Global
Others

నకిలీ సర్టిఫికెట్లు తయారీ గ్యాంగ్ అరెస్ట్‌

హైద‌రాబాద్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ ఖుబా కాలనీకి చెందిన మహ్మద్‌ సలీముద్దీన్‌, సైదాబాద్‌ సరస్వతీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌ అలియాస్‌ యూసుఫ్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. అవసరం ఉన్న వారికి 20 నుంచి 25 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సలీముద్దీన్‌ ఇంటిపై దాడిచేసి ఆంధ్ర, ఎస్‌వీ, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాలకు […]

హైద‌రాబాద్‌లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. బండ్లగూడ ఖుబా కాలనీకి చెందిన మహ్మద్‌ సలీముద్దీన్‌, సైదాబాద్‌ సరస్వతీ నగర్‌కు చెందిన ఇస్మాయిల్‌ అలియాస్‌ యూసుఫ్‌ ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, పీజీ, బీటెక్‌ నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నారు. అవసరం ఉన్న వారికి 20 నుంచి 25 వేలకు విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సలీముద్దీన్‌ ఇంటిపై దాడిచేసి ఆంధ్ర, ఎస్‌వీ, జేఎన్‌టీయూ విశ్వవిద్యాలయాలకు సంబంధించిన 97 నకిలీ సర్టిఫికెట్లతోపాటు వాటి తయారీకి ఉపయోగించే సామగ్రి, స్టాంపులను స్వాధీనం చేసుకున్నారు. వారిని చాంద్రాయణగుట్ట పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.
చింతల్‌ బస్తీ ప్రాంతంలో సిటీ అకాడమీ ప్రొఫెషనల్‌ స్టడీస్‌ ఏజెన్సీ పేరిట వార్తా పత్రికల్లో ప్రకటనలిచ్చే ఓ సంస్థ ముసుగులో నకిలీ సర్టిఫికెట్లను తయారు చేస్తున్న ముఠా సభ్యుల్లో ఒకరైన గొల్లపల్లి శ్రావణ్‌ను అదుపులోకి తీసుకున్నారు. సీపీయూ, హార్డ్‌ డిస్క్‌, సర్టిఫికెట్‌లతోపాటు కంప్యూటర్‌ మానిటర్‌ను స్వాధీనం చేసుకుని సైఫాబాద్‌ పోలీసులకు అప్పగించారు. అతడిని విచారించగా ప్రధాన సూత్రధారి రాచపల్లి రామభద్రరావు, మరో వ్యక్తి రావిపల్లి వెంకటరమణమూర్తి ఉన్నారని తెలిపాడు. వారిద్దరూ పరారీలో ఉన్నారు. పీహెచ్‌డీ సర్టిఫికెట్‌కు లక్ష, బీటెక్‌ సర్టిఫికెట్‌కు ల‌క్ష‌, డిప్లొమా సర్టిఫికెట్‌కు 60 వేలు, 10వ తరగతి నుంచి డిగ్రీ సర్టిఫికెట్లకు 10 నుంచి 30 వేల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు చెప్పాడు. పోలీసులు అతడిని రిమాండ్‌కు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
First Published:  15 Jun 2015 6:37 PM IST
Next Story