‘రుద్రమదేవి’కి చిరు వాయిస్
భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ…‘‘ ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న మా ‘రుద్రమదేవి’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్ పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్’కి అమితాబ్ బచ్చన్ […]
BY Pragnadhar Reddy15 Jun 2015 7:30 PM IST
X
Pragnadhar Reddy Updated On: 16 Jun 2015 5:07 AM IST
భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియో స్కోపిక్ 3డి ద్విభాషా చిత్రం ‘రుద్రమదేవి’. అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో ఇప్పటివరకు తెలుగు చలన చిత్ర చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిన ఈ చారిత్రాత్మక చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక, నిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ…‘‘ ఎంతో భారీ వ్యయంతో రూపొందుతున్న మా ‘రుద్రమదేవి’ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన రికార్డింగ్ పూర్తయింది. హిందీ చిత్రం ‘లగాన్’కి అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ ఎంతటి హైలైట్ అయిందో… అలాగే మా చిత్రానికి చిరంజీవి గారు వాయిస్ ఓవర్ ఇవ్వడంతో సినిమాకి ఇంకా హైప్ వచ్చింది. చిరంజీవిగారి వాయిస్ ఓవర్ ఈ చిత్రానికి ఓ స్పెషల్ అట్రాక్షన్ అవుతుంది. మా చిత్రానికి వాయిస్ ఓవర్ అడగ్గానే ఆయన అంగీకరించి దానికి సంబంధించిన రికార్డింగ్ కూడా పూర్తి చేయడానికి సహకరించిన చిరంజీవికి స్పెషల్ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను’’ అన్నారు.
Next Story