జర నవ్వండి ప్లీజ్ 114
రాజేష్ గుడి దగ్గర సైకిల్ పెట్టి దేవుడికి నమస్కరించి సైకిల్ మరచిపోయి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడినుండి రాత్రి చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు. పొద్దున్నే నిద్రలేచేసరికి సైకిల్ గుర్తుకొచ్చింది. పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వచ్చాడు. ఎక్కడ సైకిల్ అక్కడే ఉంది. రాజేష్ సంతోషంతో గుడిలోకి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని బయటికి వచ్చాడు. సైకిల్ లేదు. ————————————————————– ఆమె భర్త చనిపోయాడు. అతను ఇన్సూర్ చేసిన పాలసీ డబ్బులు అందాయి. రెండు లక్షల […]
రాజేష్ గుడి దగ్గర సైకిల్ పెట్టి దేవుడికి నమస్కరించి సైకిల్ మరచిపోయి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడినుండి రాత్రి చీకటి పడ్డాక ఇంటికి వెళ్ళి నిద్రపోయాడు.
పొద్దున్నే నిద్రలేచేసరికి సైకిల్ గుర్తుకొచ్చింది. పరిగెత్తుకుంటూ గుడి దగ్గరికి వచ్చాడు.
ఎక్కడ సైకిల్ అక్కడే ఉంది. రాజేష్ సంతోషంతో గుడిలోకి వెళ్ళి దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుని బయటికి వచ్చాడు. సైకిల్ లేదు.
————————————————————–
ఆమె భర్త చనిపోయాడు. అతను ఇన్సూర్ చేసిన పాలసీ డబ్బులు అందాయి.
రెండు లక్షల రూపాయల చెక్కుచూసి అతని భార్య కన్నీళ్ళు కారుస్తూ “ఇప్పుడు మా ఆయన గనక తిరిగి వస్తే ఈ డబ్బుల్లో సగం ఆయనకు తిరిగి ఇచ్చేస్తా” అంది.
————————————————————–
“నన్ను ఇబ్బంది పెట్టకయ్యా” అన్నాడు విశ్వం. కానీ ఇన్సూరెన్స్ ఏజెంట్ వదలకుండా భీమావల్ల లాభాలు చెప్పుకుంటూపోతున్నాడు. ఇక చాలయ్య బాబూ వెళ్ళు, నేను పడుకోవాలి” అని విశ్వం కసురుకున్నాడు.
ఇన్సూరెన్స్ ఏజెంట్ “మంచిది సార్! వెళుతున్నా. పడుకోండి. ఐతే మీరు ఒకవేళ పొద్దున్నే లేస్తే మటుకు నాకు ఫోను చెయ్యండి” అన్నాడు.