Telugu Global
Others

తల్లికి పిండం పెడుతున్న కొడుకు మృతి

విజయనగరం మండలం సుంకరిపేటలోని శ్మశానంలో పిడుగుపడి ఓ నిండుప్రాణం బలైంది. సుంకరిపేటకు చెందిన సుంకర ఆదమ్మ మృతి చెందగా అంత్యక్రియల్లో భాగంగా తల్లికి పిండం పెట్టడానికి కుమారుడు శివ.. బంధువులు శ్మశానికి వెళ్లారు. అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుండగానే వర్షంతోపాటు పిడుగు పడగా శివ (26) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే తల్లి, తమ్ముడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే బాధతో శివ సోదరి తీవ్ర అస్వస్థతకు గురై […]

విజయనగరం మండలం సుంకరిపేటలోని శ్మశానంలో పిడుగుపడి ఓ నిండుప్రాణం బలైంది. సుంకరిపేటకు చెందిన సుంకర ఆదమ్మ మృతి చెందగా అంత్యక్రియల్లో భాగంగా తల్లికి పిండం పెట్టడానికి కుమారుడు శివ.. బంధువులు శ్మశానికి వెళ్లారు. అక్కడ ఈ కార్యక్రమం జరుగుతుండగానే వర్షంతోపాటు పిడుగు పడగా శివ (26) అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో 8 మందికి గాయాలయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలోనే తల్లి, తమ్ముడు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారనే బాధతో శివ సోదరి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోగా ఆస్పత్రికి తరలించారు.
First Published:  14 Jun 2015 6:47 PM IST
Next Story