రేవంత్‌కు 29 వరకు రిమాండ్ పొడిగింపు
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలకు జ్యుడీషియల్ రిమాండును ఈనెల 29 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి రేవంత్ తదితరుల బృందానికి ఈ రోజుతో రిమాండ్ ముగియవలసి ఉంది. కాని కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన టేపులపై నివేదిక ఇంకా రానందున వీరి రిమాండ్ గడువును పెంచాలని ఏసీబీ కోర్టుకు అధికారులు మెమో సమర్పించారు. దీనిపై స్పందించిన కోర్టు జ్యుడీషియల్ […]
BY admin15 Jun 2015 7:22 AM IST
X
admin Updated On: 15 Jun 2015 8:01 AM IST
ఓటుకు నోటు కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ప్రస్తుతం చర్లపల్లి జైలులో ఉన్న ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, సెబాస్టియన్, ఉదయ్‌సింహలకు జ్యుడీషియల్ రిమాండును ఈనెల 29 వరకు పొడిగిస్తూ ఏసీబీ కోర్టు తీర్పు చెప్పింది. వాస్తవానికి రేవంత్ తదితరుల బృందానికి ఈ రోజుతో రిమాండ్ ముగియవలసి ఉంది. కాని కేసులో దర్యాప్తు కొనసాగుతున్నందున, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించిన టేపులపై నివేదిక ఇంకా రానందున వీరి రిమాండ్ గడువును పెంచాలని ఏసీబీ కోర్టుకు అధికారులు మెమో సమర్పించారు. దీనిపై స్పందించిన కోర్టు జ్యుడీషియల్ రిమాండును 29 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
బెయిల్ కోసం హైకోర్టులో రేవంత్ పిటిషన్
తన విచారణ పూర్తయినా ఇంకా రిమాండు పొడిగించడం అన్యాయమంటూ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనను కొత్తగా విచారించడానికి ఏమీ లేదని, అవినీతి నిరోధక శాఖ కూడా నాలుగు రోజులపాటు తన రిమాండులో ఉంచుకుని విచారించిందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తాను ప్రజా ప్రతినిధినని, విచారణ అయిపోయిన తర్వాత ఇంకా రిమాండులో ఉంచాల్సిన అవసరం లేదని పేర్కొంటూ ఆయన తన పిటిషన్‌లో తెలిపారు. రాజకీయ కక్షతోనే తనను కేసులో ఇరికించారని, తాను దర్యాప్తుకు ఆటంకం కలిగించనని, తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు. రేవంత్‌తోపాటు సెబాస్టియన్, ఉదయ్‌సింహ కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేశారు.

Next Story