సెల్ టవర్ మీదే గుండెపోటు... మృతి
తను అధికారి వేధిస్తున్నాడంటూ నిరసన తెలపడానికి సెల్ టవర్ ఎక్కిన ఓ రైతు అక్కడే గుండె పోటు రావడంతో మరణించాడు. ఈ సంఘటన కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగింది. మక్బుల్ భాషా అనే రైతు ఎంతో కాలం నుంచి తనకు రావలసిన పట్టాదారు పాస్ పుస్తకం కోసం తాసిల్దారు చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా తిరిగి తిరిగి అలసిపోయిన అతను సెల్ టవర్ ఎక్కి తన నిరసనను అందరికీ తెలియజేయాలని భావించాడు. టవర్ ఎక్కి నిరసన […]
BY admin14 Jun 2015 6:52 PM IST
admin Updated On: 15 Jun 2015 7:54 AM IST
తను అధికారి వేధిస్తున్నాడంటూ నిరసన తెలపడానికి సెల్ టవర్ ఎక్కిన ఓ రైతు అక్కడే గుండె పోటు రావడంతో మరణించాడు. ఈ సంఘటన కడప జిల్లా నందలూరు మండలం నాగిరెడ్డిపల్లిలో జరిగింది. మక్బుల్ భాషా అనే రైతు ఎంతో కాలం నుంచి తనకు రావలసిన పట్టాదారు పాస్ పుస్తకం కోసం తాసిల్దారు చుట్టూ తిరుగుతున్నాడు. ఇలా తిరిగి తిరిగి అలసిపోయిన అతను సెల్ టవర్ ఎక్కి తన నిరసనను అందరికీ తెలియజేయాలని భావించాడు. టవర్ ఎక్కి నిరసన తెలుపుతున్న సమయంలో హఠాత్తుగా అతనికి గుండెపోటు వచ్చింది. అంతే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. కింద నుంచి బంధువులు తెలిసినవారు వెళ్ళి ఆదుకునే లోపే అతను ప్రాణాలు వదిలిపెట్టేశాడు. ఈ దారుణానికి తాసిల్దారే కారణమంటూ బంధువులు ఆదోళనకు దిగారు. పోలీసులు సెల్ టవర్‌పై ఉన్న మక్బుల్ భాషా మృతదేహాన్ని కిందకి దింపడానికి ప్రయత్నం చేస్తుండగా ఆయన బంధువులంతా అడ్డుకున్నారు. తమకు న్యాయం చేసే వరకు భాషా శవాన్ని కిందకి దింపనివ్వమని భీష్మించి ఆందోళనకు దిగారు.
Next Story