Telugu Global
Others

కేసీఆర్‌, చంద్ర‌బాబుకు యోగా బెట‌ర్!

ఆంథ్ర‌, తెలంగాణ‌ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ల‌కు ప‌్రస్తుతం మానసిక ప్రశాంతత కరువైందని, అందుకే ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుని యోగా చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హిత‌వు చెప్పారు. ఈ మేరకు ఇద్దరికీ ఆహ్వాన లేఖలు రాస్తానని తెలిపారు. వీరిద్ద‌రూ విద్వేషాలు వీడి అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఆయ‌న కోరారు. ఇటీవల నాయకులు, మంత్రులు వాడుతున్న భాష మంచిది కాదని, సంయమనం […]

ఆంథ్ర‌, తెలంగాణ‌ సీఎంలు చంద్రబాబు, కేసీఆర్‌ల‌కు ప‌్రస్తుతం మానసిక ప్రశాంతత కరువైందని, అందుకే ఈ నెల 21న నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవం సంద‌ర్భంగా ఇద్దరు సీఎంలు పక్కపక్కనే కూర్చుని యోగా చేయాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి హిత‌వు చెప్పారు. ఈ మేరకు ఇద్దరికీ ఆహ్వాన లేఖలు రాస్తానని తెలిపారు. వీరిద్ద‌రూ విద్వేషాలు వీడి అభివృద్ధే లక్ష్యంగా పని చేయాలని ఆయ‌న కోరారు. ఇటీవల నాయకులు, మంత్రులు వాడుతున్న భాష మంచిది కాదని, సంయమనం పాటించాలని పరోక్షంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఓటుకు నోటు కేసులో తప్పొప్పులు తేలాకే… టీడీపీతో పొత్తు కొనసాగించాలా? వద్దా? అన్న అంశంపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఓటుకు నోటు కేసు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి పత్రికా క్లిప్పింగులు, ఇతర వివరాలతో నివేదికను కేంద్రానికి పంపించామన్నారు. బీజేపీ నైతిక విలువలతో కూడుకున్న పార్టీ అని, రాజకీయాల్లోనూ నైతిక విలువలు పెరగాలని కోరుకుంటుందని పేర్కొన్నారు.
First Published:  14 Jun 2015 7:08 PM IST
Next Story