Telugu Global
Others

బదిలీలపై నిషేధం విధిస్తూ ఏపీ సర్కార్‌ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా మారాయి. మంత్రివర్గ సమావేశంలో చర్చించి మే 18 నుంచి 31 వరకూ ప్రభుత్వం బదిలీలకు తొలుత సమయం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలో మహానాడు, ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న మంత్రులు బదిలీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోయారు. గడువు ముగిసే సమయానికి బదిలీలకు సంబంధించి కొంత సమయం కావాలంటూ ముఖ్యమంత్రిని మంత్రులు కోరడంతో దానికి ఆయన మళ్లీ […]

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలు ప్రహసనంగా మారాయి. మంత్రివర్గ సమావేశంలో చర్చించి మే 18 నుంచి 31 వరకూ ప్రభుత్వం బదిలీలకు తొలుత సమయం ఇచ్చింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ సమయంలో మహానాడు, ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న మంత్రులు బదిలీలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేక పోయారు. గడువు ముగిసే సమయానికి బదిలీలకు సంబంధించి కొంత సమయం కావాలంటూ ముఖ్యమంత్రిని మంత్రులు కోరడంతో దానికి ఆయన మళ్లీ కొంత సమయం ఇచ్చారు. ఈ నెల తొమ్మిదో తేదీ నుంచి 15వ తేదీ వరకూ బదిలీలు చేసుకోవాల్సిందిగా చెప్పడంతో ఈ మేరకు ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు ఇదే నెలలో మరోసారి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకు ముందు చేసిన బదిలీలన్నీ నిలుపు చేయాల్సిందిగా ఆదేశించారు. ఈనేప‌థ్యంలోనే స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈసీ విడుదల చేసిన షెడ్యూలు బదిలీల ప్రక్రియకు విఘాతంగా మారింది. ఎన్నికలతో సంబంధం లేని శాఖల్లో బదిలీలు నిర్వహించుకోవచ్చని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్‌ సూచించినా ఎందుకొచ్చిన తంటాలు అనుకున్న ప్రభుత్వం బదిలీలపై నిషేధం విధిస్తూ శుక్రవారం ఆర్ధరాత్రి హడావుడిగా ఉత్తర్వులు జారీ చేసింది.
First Published:  14 Jun 2015 6:49 PM IST
Next Story