Telugu Global
Others

వండర్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కిన రెండో తరగతి విద్యార్థి 

నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని బాలభారతి ప్రయివేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు తబీద్ అహ్మద్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు,  జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులు అందుకున్నాడు. వైద్య విభాగంలో ఏడువందల ప్రశ్నలకు గాను 690 ప్రశ్నలకు జవాబులు చెప్పి తబీద్ ఈ ఘనత సాధించాడు. విద్యార్థి అహ్మద్‌ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అభినందించి పదివేల రూపాయల నగదును బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్టు ప్రకటించారు. ఇలాంటి పిల్ల‌ల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, […]

నెల్లూరు జిల్లా కోట మండలం విద్యానగర్‌లోని బాలభారతి ప్రయివేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న ఏడేళ్ల బాలుడు తబీద్ అహ్మద్ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డులు అందుకున్నాడు. వైద్య విభాగంలో ఏడువందల ప్రశ్నలకు గాను 690 ప్రశ్నలకు జవాబులు చెప్పి తబీద్ ఈ ఘనత సాధించాడు. విద్యార్థి అహ్మద్‌ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ అభినందించి పదివేల రూపాయల నగదును బ‌హుమ‌తిగా ఇస్తున్న‌ట్టు ప్రకటించారు. ఇలాంటి పిల్ల‌ల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని, త‌మ త‌మ పిల్ల‌ల‌ను త‌ల్లిదండ్రులు సాన‌ప‌డితే ఉత్త‌మ పౌరులుగా త‌యార‌వుతార‌ని ఆయ‌న అన్నారు.

First Published:  13 Jun 2015 6:35 PM IST
Next Story