Telugu Global
Health & Life Style

సర్వైకల్ స్పాండిలోసిస్ నియంత్రణ కోసం...

 మెడలోని వెన్నుపూసల నుంచి మొదలుకుని భుజం నుంచి చేతిలోకి విపరీతమైన నొప్పి…. మెడ నుంచి చేతిలోకి పాకుతున్నట్లుగా ఉండే నొప్పిని వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడనొప్పి వచ్చినపుడు సాధారణ పెయిన్ కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి ఉంటే వెంటనే వైద్యుని కలవడం ఉత్తమం. నొప్పి ఒక చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికి గానీ ఇతర అవయవాలకు గానీ పాకుతున్నట్లు ఉండడం, నీరసంగా ఉండి చేతులు గానీ కాళ్లు గానీ తిమ్మిరి పట్టినట్లు ఉంటే […]

సర్వైకల్ స్పాండిలోసిస్ నియంత్రణ కోసం...
X
మెడలోని వెన్నుపూసల నుంచి మొదలుకుని భుజం నుంచి చేతిలోకి విపరీతమైన నొప్పి…. మెడ నుంచి చేతిలోకి పాకుతున్నట్లుగా ఉండే నొప్పిని వైద్య పరిభాషలో సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. మెడనొప్పి వచ్చినపుడు సాధారణ పెయిన్ కిల్లర్ వేసుకున్నా ఆగకుండా అదేపనిగా నొప్పి ఉంటే వెంటనే వైద్యుని కలవడం ఉత్తమం. నొప్పి ఒక చోట లేకుండా చురుక్కుమంటూ భుజానికి గానీ ఇతర అవయవాలకు గానీ పాకుతున్నట్లు ఉండడం, నీరసంగా ఉండి చేతులు గానీ కాళ్లు గానీ తిమ్మిరి పట్టినట్లు ఉంటే సర్వైకల్‌స్పాండిలోసిస్ లక్షణాలుగా గమనించాలి.
  • సర్వైకల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే మెడనొప్పిని నివారించుకోవడానికి తగినంత విశ్రాంతి తీసుకోవడం మంచి మార్గం.
  • నొప్పి నివారణ కోసం ఇపుడు పైపూత మందులు కూడా అందుబాటులో ఉన్నాయి.
  • పైపూత మందులను మృదువుగా మసాజ్ చేస్తున్నట్లు రాయాలి.
  • నొప్పి ఉన్న చోట ఐస్‌ను కాపడం పెట్టాలి. ఐస్ ను కూడా మృదువుగా అద్దాలి.
  • తల భారాన్ని పూర్తిగా ఎముకలపైనే పడనివ్వకుండా మెడ కండరాలను బలంగా చేసేందుకు మెడ వ్యాయామాలను చేయాలి.
  • నిపుణులైన ఫిజియో థెరపిస్ట్ ఆధ్వర్యంలో మెడ వ్యాయామాలను చేయడం వల్ల నొప్పి నుంచి చాలా మేరకు ఉపశమనం లభిస్తుంది.
  • డాక్టర్ సలహాతో నొప్పి నివారణ మందులు వాడాలి.
First Published:  14 Jun 2015 1:31 AM IST
Next Story