Telugu Global
Others

రంగారెడ్డిలో గోడ‌కూలి న‌లుగురి దుర్మ‌ర‌ణం

రాత్రంతా కురిసిన జోరువానకు ఇంటి గోడ కూలడంతో నలుగురు వ్యక్తులు మృతిచెందారు. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగేడుపల్లిలో చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న వారిపై అర్ధరాత్రి గోడ కూలింది. నిద్రిస్తున్నవారు నిద్రిస్తున్నట్లే తుదిశ్వాసను విడిచారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. గజ్జెల శ్రీనివాస్, లావణ్య, వంశీ(6), రాజు(5)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికుల సహాయంతో శిథిలాల తొలగింపును చేపట్టారు.

First Published:  13 Jun 2015 6:36 PM IST
Next Story