Telugu Global
Others

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో టేపులు

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు ఎర కేసులో కీల‌క‌మైన ఆడియో, వీడియో టేపులు ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరాయి. దీనిపై రెండు,మూడు రోజుల్లో నివేదిక రానుంది. నివేదిక ఏం చెబుతుందా? అని రెండు రాష్ర్టాల‌తోపాటు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. నివేదిక ఆధారంగా మ‌రింత మందిని కేసులో చేర్చే అవ‌కాశ‌ముండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఆ జాబితాలో మొద‌ట ఉండేది సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఏసీబీ పోలీసులు చెబుతున్న‌ట్లుగా […]

ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఆడియో టేపులు
X

దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు ఎర కేసులో కీల‌క‌మైన ఆడియో, వీడియో టేపులు ఇప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరాయి. దీనిపై రెండు,మూడు రోజుల్లో నివేదిక రానుంది. నివేదిక ఏం చెబుతుందా? అని రెండు రాష్ర్టాల‌తోపాటు, దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెల‌కొంది. నివేదిక ఆధారంగా మ‌రింత మందిని కేసులో చేర్చే అవ‌కాశ‌ముండ‌ట‌మే ఇందుకు కార‌ణం. ఆ జాబితాలో మొద‌ట ఉండేది సాక్షాత్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్ర‌బాబు కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నార్హం. ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఏసీబీ పోలీసులు చెబుతున్న‌ట్లుగా వ‌స్తే… ఏపీ రాజ‌కీయాల్లో భారీ కుదుపు త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ‌పండితులు స్ప‌ష్టం చేస్తున్నారు. ఆడియో టేపుల్లో ఉన్న‌ది చంద్ర‌బాబు గొంతేన‌ని తేలితే ఆయ‌న‌తో పాటు మ‌రో ఇద్ద‌రు ప్ర‌ముఖుల మెడ‌కు ఈ కేసు చుట్టుకోనుంద‌ని భావిస్తున్నారు. త‌ద‌నంత‌రం ఏసీబీ ఎలాంటి ముంద‌డుగు వేస్తుందో మూడురోజుల్లో తేలిపోతుంది.

ఏమిటీ ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) ?
దేశంలో జ‌రిగిన బాంబు పేలుళ్లు, అగ్నిప్ర‌మాదాలు, హ‌త్యాకాండ‌లు, సైబ‌ర్ నేరాలు వంటి జాతీయ‌, అంత‌ర్జాతీయ స్థాయిలో సంచ‌ల‌నం సృష్టించిన కేసుల చిక్కుముడి విప్పేదే ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ. 1967లో తొలిసారిగా ఎఫ్‌ఎస్‌ఎల్ ని ప్రారంభించారు. 2002లో హైద‌రాబాద్‌లో మ‌రో శాఖ‌ను ప్రారంభించారు. దేశంలో వివిధ ద‌ర్యాప్తు సంస్థ‌లైన సీఐడీ, సీబీసీఐడీ, సీబీఐ. ఎన్ ఐ ఏ, రా వంటి ద‌ర్యాప్తు సంస్థ‌లు చేప‌ట్టిన‌ ఎన్నో కీల‌క కేసుల‌ను ఛేదించిన ఘ‌న చ‌రిత్ర ఎఫ్ ఎస్ ఎల్‌కు ఉంది. ఇటీవ‌ల దిల్‌సుఖ్‌న‌గ‌ర్ బాంబు పేలుళ్ల కేసు, పాల‌మూరు బ‌స్సు దుర్ఘ‌ట‌న‌కేసులోనూ ఆధారాలు గుర్తించడంలో ఎఫ్ ఎస్ ఎల్ కీల‌క పాత్ర పోషించింది. ముఖ్యంగా పాల‌మూరు బ‌స్సు దుర్ఘ‌ట‌న‌లో 42 మంది మృత‌దేహాలు కాలి మాంస‌పు ముద్ద‌ల‌య్యాయి. వాటికి డీఎన్ ఏ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి గుర్తించ‌డంలో ఇది ఎంతో సాయ‌ప‌డింది.

First Published:  13 Jun 2015 5:17 AM IST
Next Story