Telugu Global
Others

వెలుగులోకి వెయ్యి చేతుల బుద్ధుడు!

బుద్ధ భగవానుడి విగ్రహాన్ని చైనా పునరుద్ధరించింది. ఇది 800 ఏళ్ళక్రితం నాటి విగ్ర‌హం. వెయ్యి చేతులున్న ఈ విగ్రహాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఏడు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఇందుకోసం 9.8 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 7.7 మీటర్ల ఎత్తు, 12.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విగ్రహం క్రీస్తు శకం 1127-1279 మధ్య సౌతెర్న్ సాంగ్ రాజు ఏలుబడిలో సిచువాన్ ప్రావిన్స్ డాజు కౌంటీలో కట్టారు. చారిత్రక విశేషతతోపాటు విగ్రహం అద్భుత […]

వెలుగులోకి వెయ్యి చేతుల బుద్ధుడు!
X
బుద్ధ భగవానుడి విగ్రహాన్ని చైనా పునరుద్ధరించింది. ఇది 800 ఏళ్ళక్రితం నాటి విగ్ర‌హం. వెయ్యి చేతులున్న ఈ విగ్రహాన్ని తిరిగి మామూలు స్థితికి తీసుకురావడానికి ఏడు సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. ఇందుకోసం 9.8 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. 7.7 మీటర్ల ఎత్తు, 12.5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ విగ్రహం క్రీస్తు శకం 1127-1279 మధ్య సౌతెర్న్ సాంగ్ రాజు ఏలుబడిలో సిచువాన్ ప్రావిన్స్ డాజు కౌంటీలో కట్టారు. చారిత్రక విశేషతతోపాటు విగ్రహం అద్భుత రాతి కట్టడంగా కూడా పేరు గాంచింది. ఇంత చారిత్రక నేపథ్యమున్న విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. ప్రత్యేక పరికరాలుపయోగించి బంగారు పూత పూశారు. అక్కడక్కడా దెబ్బతిన్న భాగాలను సరి చేశారు. మరో 800 సంవత్సరాలు మన్నేలా జాగ్రత్తగా విగ్రహాన్ని పునరుద్ధరించారు. ఎలాంటి క్లిష్టమైన ప్రాజెక్టునైనా చేపట్టి విజయవంతం చేయగలిగే సత్తా తమకుందని చైనీయులు మరోసారి నిరూపించుకున్నారు.
First Published:  13 Jun 2015 11:44 AM IST
Next Story