అడ్డంగా దొరికినా బాబుకు కొన్ని పత్రికల దన్ను: తలసాని
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కొన్ని పత్రికలు వెనకేసుకొస్తున్నాయని, విషయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా విషయాన్ని దాచిపెట్టి అనవసర రాద్దాంతం చేస్తున్నారని తలసాని విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై బాబు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో హైదరబాద్ […]
BY sarvi13 Jun 2015 10:17 AM IST
X
sarvi Updated On: 13 Jun 2015 10:17 AM IST
ఓటుకు నోటు వ్యవహారంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్‌తో ఫోన్‌లో సంభాషిస్తూ అడ్డంగా దొరికిపోయిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కొన్ని పత్రికలు వెనకేసుకొస్తున్నాయని, విషయాన్ని తక్కువ చేసి చూపిస్తున్నాయని తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. చంద్రబాబు సిగ్గు లేకుండా విషయాన్ని దాచిపెట్టి అనవసర రాద్దాంతం చేస్తున్నారని తలసాని విమర్శించారు. అసలు విషయాన్ని పక్కకు పెట్టి హైదరాబాద్ నగరంలోని శాంతి భద్రతలపై బాబు లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖలో హైదరబాద్ విషయాన్ని ప్రస్తావించడం నిజంగా దురదృష్టకరమన్నారు. ముడుపుల వ్యవహారంలో నిండా మునిగిన బాబు, టీడీపీ నేతలు.. ఆంధ్రా ప్రజలను అడ్డుపెట్టుకోవాలని చూస్తున్నారన్నారు. చంద్రబాబు దుర్మార్గాన్ని, కన్నింగ్ బుద్ధిని ఆంధ్రా ప్రజలు తెలుసుకోవాలని తలసాని సూచించారు. ఏడాది కాలంగా హైదరాబాద్ లో సీమాంధ్రులు ప్రశాంతంగా ఉన్నారని ఈ సందర్భంగా తలసాని గుర్తు చేశారు. వైఎస్సార్ సీపీ నేతలను తన పార్టీలోకి చేర్చుకున్న చంద్రబాబుకు ఇతర పార్టీల గురించి మాట్లాడే హక్కు ఉందా?అని తలసాని ప్రశ్నించారు.
Next Story