పవన్ సినిమాలో ఎన్టీఆర్
త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా, నిజానికి పవన్ కల్యాణ్ చేయాల్సిన స్టోరీ అట. […]
BY admin13 Jun 2015 12:56 AM
X
admin Updated On: 13 Jun 2015 12:56 AM
త్వరలోనే త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ సినిమా చేయబోతున్నాడనే సంగతి అందరికీ తెలిసిందే. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమా ఓ కొలిక్కి వచ్చిన వెంటనే త్రివిక్రమ్ తో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. తాజాగా తెలిసిన సమాచారం ప్రకారం త్రివిక్రమ్ డైరక్షన్ లో ఎన్టీఆర్ చేయబోయే సినిమా, నిజానికి పవన్ కల్యాణ్ చేయాల్సిన స్టోరీ అట.
సన్నాఫ్ సత్యమూర్తి తర్వాత మళ్లీ పవన్ కోసమే ఓ కథ సిద్ధం చేసుకున్నాడట త్రివిక్రమ్. కానీ పవన్ మాత్రం త్రివిక్రమ్ కు మళ్లీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. ఎందుకంటే.. అప్పటికే గబ్బర్ సింగ్-2కు కమిటయ్యాడు. పైగా చాన్నాళ్లుగా లేటవుతూ వస్తున్న ప్రాజెక్ట్ అది. అందుకే మరో హీరోను చూసుకోమన్నాడట. అలా పవన్ కల్యాణ్ కోసం రాసిన కథ ఎన్టీఆర్ కు వినిపించడం, తారక్ వెంటనే ఓకే చెప్పడం చకచకా జరిగిపోయాయి. గతంలో పవన్ కోసం అనుకున్న కథల్ని మిగతా హీరోలు చేసి చాలా హిట్లు కొట్టాడు. ఇప్పుడు అదే కోవలో ఎన్టీఆర్ కూడా పవన్ కథతో బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి.
Next Story