Telugu Global
Others

అంద‌రూ ఉన్న అనాథ‌లా శ్మ‌శానంలో ఓ వృద్ధుడు!

అనుబంధం, ఆత్మీయ‌త అంతా ఒక బూట‌కం… ఆత్మ తృప్తికై మ‌నుషులు ఆడుకునే నాట‌కం… వింత నాట‌కం… ఓ క‌వి అల్లిన ఈ పాట‌లోని మాట‌లు అక్ష‌ర స‌త్యాల‌ని ఈ క‌థ‌నాన్ని గ‌మ‌నిస్తే అర్ధమ‌వుతుంది… ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో డ‌భ్బై యాళ్ళ ఓ తండ్రిని శ్మ‌శానం వ‌దిలేశారు కుటుంబ స‌భ్యులు. చ‌స్తే పూడ్చి పెట్ట‌మ‌ని, చచ్చేదాకా గొంతులో కాసిని నీళ్ళు పోయ‌మ‌ని అక్క‌డున్న కాటికాప‌రికి చెప్పి వెళ్ళిపోయాడు కొడుక‌నే ఓ ప్ర‌బుద్ధుడు. కాశ‌య్య అనే ఈ వృద్ధుడికి ముగ్గురు […]

అంద‌రూ ఉన్న అనాథ‌లా శ్మ‌శానంలో ఓ వృద్ధుడు!
X
అనుబంధం, ఆత్మీయ‌త అంతా ఒక బూట‌కం… ఆత్మ తృప్తికై మ‌నుషులు ఆడుకునే నాట‌కం… వింత నాట‌కం… ఓ క‌వి అల్లిన ఈ పాట‌లోని మాట‌లు అక్ష‌ర స‌త్యాల‌ని ఈ క‌థ‌నాన్ని గ‌మ‌నిస్తే అర్ధమ‌వుతుంది… ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా పాల‌కొల్లులో డ‌భ్బై యాళ్ళ ఓ తండ్రిని శ్మ‌శానం వ‌దిలేశారు కుటుంబ స‌భ్యులు. చ‌స్తే పూడ్చి పెట్ట‌మ‌ని, చచ్చేదాకా గొంతులో కాసిని నీళ్ళు పోయ‌మ‌ని అక్క‌డున్న కాటికాప‌రికి చెప్పి వెళ్ళిపోయాడు కొడుక‌నే ఓ ప్ర‌బుద్ధుడు. కాశ‌య్య అనే ఈ వృద్ధుడికి ముగ్గురు కుమార్తెలు… ఓ కుమారుడు. స్వ‌ర్ణ‌కారుల వృత్తికి చెందిన ఈ కుటుంబానికి తండ్రి భార‌మ‌య్యాడు. కూతుర్ల జాడ తెలీదు. కొడుకు మాత్రం త‌న తండ్రిని నాలుగు రోజుల క్రితం శ్మ‌శానానికి తీసుకువ‌చ్చి వ‌దిలేసి వెళ్ళిపోయాడు. అక్క‌డున్న కాటి కాప‌రికి అప్ప‌గించేసి అక్క‌డి నుంచి ప‌లాయ‌నం చిత్త‌గించాడు. నాలుగు రోజుల నుంచి న‌క‌న‌క‌లాడే ఆక‌లితో అక్క‌డే ఉండిపోయాడు. శ‌రీరం స‌హ‌క‌రించ‌క‌ క‌ద‌ల‌లేని స్థితి… చితిమంట‌ల మ‌ధ్య అలాగే ఆక‌లితో మ‌ల‌మ‌లామాడిపోయాడు. ఈ ధైన్య‌స్థితిని చూసిన కాటికాప‌రి అక్క‌డికి వ‌చ్చిన కొంత‌మందికి చెప్పాడు. దాంతో ఈ వృద్ధుడి క‌థ వెలుగులోకి వ‌చ్చింది. అత‌ని కుటుంబ స‌భ్యుల కోసం ఆచూకీ తీస్తున్నారు.
First Published:  13 Jun 2015 4:27 AM GMT
Next Story