తుళ్ళూరుకు రైలుపై రేల్వేశాఖ అధ్యయనం?
తుళ్లూరుకు నూతన రైలుమార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై రైల్వేశాఖ దృష్టి సారించింది. మంగళగిరి రైల్వేస్టేషన్ నుంచి తుళ్లూరు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో నూతన రైల్వేమార్గాన్ని నిర్మించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల్లోనే రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణుల బృందం ఆయా ప్రాంతాలను సందర్శించనున్నట్లు తెలిసింది. మంగళగిరి నుంచి తుళ్లూరుతోపాటు దానికి కాస్త ముందున్న అమరావతికి కూడా రైలుమార్గం నిర్మాణంపై ఉన్నతాధికారులు పరిశీలన జరపవచ్చునని కూడా తెలుస్తోంది. తుళ్లూరుకు మంగళగిరి […]
BY sarvi12 Jun 2015 6:37 PM IST
sarvi Updated On: 13 Jun 2015 6:02 AM IST
తుళ్లూరుకు నూతన రైలుమార్గాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనపై రైల్వేశాఖ దృష్టి సారించింది. మంగళగిరి రైల్వేస్టేషన్ నుంచి తుళ్లూరు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ మార్గంలో నూతన రైల్వేమార్గాన్ని నిర్మించేందుకు గల సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు కొద్ది రోజుల్లోనే రైల్వే శాఖకు చెందిన ఉన్నతాధికారులు, నిపుణుల బృందం ఆయా ప్రాంతాలను సందర్శించనున్నట్లు తెలిసింది. మంగళగిరి నుంచి తుళ్లూరుతోపాటు దానికి కాస్త ముందున్న అమరావతికి కూడా రైలుమార్గం నిర్మాణంపై ఉన్నతాధికారులు పరిశీలన జరపవచ్చునని కూడా తెలుస్తోంది. తుళ్లూరుకు మంగళగిరి నుంచి రైలుమార్గం నిర్మిస్తే రాజధాని ప్రాంతం నుంచి విజయవాడ, గుంటూరు, తెనాలిలకు సర్క్యులర్ రైళ్లను నడపవచ్చునని భావిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు ఆ మార్గంపై ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.
Next Story