Telugu Global
Cinema & Entertainment

అప్పుడే మరో సినిమా

సినిమా జయాపజయాలతో దూసుకుపోతున్నాడు నారా రోహిత్. ప్రస్తుతం అతడు నటించిన అసుర సినిమా థియేటర్లలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఉంటుండగానే ఈమధ్య ఓ సినిమా ప్రారంభించాడు. అప్పట్లో ఒకడుంటేవాడు అనే టైటిల్ తో నారా రోహిత్ కొన్ని రోజుల కిందటే ఓ సినిమా ప్రారంభించాడు. జస్ట్ అసుర రిలీజైన 2 రోజులకే ఆ కొత్త సినిమా ముహూర్తం షాట్ పడింది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా ప్రారంభించాడు రోహిత్. గుండెల్లో గోదారి, జోరు సినిమాలతో […]

అప్పుడే మరో సినిమా
X
సినిమా జయాపజయాలతో దూసుకుపోతున్నాడు నారా రోహిత్. ప్రస్తుతం అతడు నటించిన అసుర సినిమా థియేటర్లలో ఉంది. ఈ సినిమా ప్రమోషన్ లో ఉంటుండగానే ఈమధ్య ఓ సినిమా ప్రారంభించాడు. అప్పట్లో ఒకడుంటేవాడు అనే టైటిల్ తో నారా రోహిత్ కొన్ని రోజుల కిందటే ఓ సినిమా ప్రారంభించాడు. జస్ట్ అసుర రిలీజైన 2 రోజులకే ఆ కొత్త సినిమా ముహూర్తం షాట్ పడింది. ఇప్పుడు ఇంకో సినిమా కూడా ప్రారంభించాడు రోహిత్. గుండెల్లో గోదారి, జోరు సినిమాలతో తన మార్కు చూపించుకున్న కుమార్ నాగేంద్ర దర్శకత్వంలో నారా రోహిత్ ఓ సినిమాకు కమిటయ్యాడు. ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్ ఈ సినిమాకు కథను సమకూర్చడం విశేషం. ఇప్పటికేవరకు నారా రోహిత్ చేయని పాత్రను ఇందులో పోషిస్తున్నాడట. సినిమాలైతే వరుసగానే చేస్తున్నాడు కానీ.. కమర్షియల్ పాయింట్ ను మాత్రం పట్టుకోలేకపోతున్నాడు రోహిత్. ఈసారైనా ఆ ప్రయత్నం చేస్తాడేమో చూడాలి.
First Published:  13 Jun 2015 6:13 AM IST
Next Story