స్థానికులకే ఉద్యోగాలివ్వాలి : జీవన్ రెడ్డి
తెలంగాణ రాష్ర్టంలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తున్నందున ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. యేడాది అయిపోయినా ఇంకా ఒక్క వాగ్దానం కూడా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా యువత ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే వెంటనే ఖాళీగా […]
BY sarvi12 Jun 2015 7:00 PM IST
sarvi Updated On: 13 Jun 2015 11:39 AM IST
తెలంగాణ రాష్ర్టంలో కొత్తగా స్థాపించే పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. పరిశ్రమలకు అన్ని వసతులు కల్పిస్తున్నందున ప్రభుత్వ రంగ పరిశ్రమలుగా భావించాల్సి వస్తుందన్నారు. మీడియాతో మాట్లాడిన జీవన్ రెడ్డి పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. యేడాది అయిపోయినా ఇంకా ఒక్క వాగ్దానం కూడా కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. ఇప్పటికైనా యువత ఆగ్రహానికి గురి కాకుండా ఉండాలంటే వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేయాలని జీవన్‌రెడ్డి డిమాండు చేశారు.
Next Story