Telugu Global
Others

రాజధాని శంకుస్థాపనకు ముగ్గురు ప్ర‌ధానులు!

ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం చంద్రబాబు.. వచ్చే దసరా రోజు రాజ‌ధాని న‌గ‌రంగా అమరావతికి శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు జపాన్, సింగపూర్‌ ప్రధానుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. విజయదశమి పర్వదినం రోజున […]

ఏపీ రాజధాని శంకుస్థాపనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీఎం చంద్రబాబు.. వచ్చే దసరా రోజు రాజ‌ధాని న‌గ‌రంగా అమరావతికి శంకుస్థాపనను కనీవినీ ఎరుగని రీతిలో.. అట్టహాసంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు ప్రధాని నరేంద్రమోడీతో పాటు జపాన్, సింగపూర్‌ ప్రధానుల‌ను ఆహ్వానించాల‌ని నిర్ణ‌యించారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయిన సందర్భంగా ఈ శంకుస్థాపన కార్యక్రమానికి ఆయనను ఆహ్వానించారు. విజయదశమి పర్వదినం రోజున శంకుస్థాపన చేస్తున్నామని, ఈ కార్యక్రమానికి రావాలని చంద్రబాబు కోరారు. దానికి మోదీ వెంటనే అంగీకరించారు. రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావడానికి సింగపూర్‌, జపాన్‌ దేశాలు కూడా ఆసక్తి చూపిస్తున్నాయని, ఆ రెండు దేశాల అధినేతలను కూడా పిలవాలని అనుకొంటున్నామని చంద్రబాబు చెప్పినప్పుడు మోడీ కూడా దానికి అడ్డు చెప్ప‌లేద‌ని తెలిసింది. జపాన్, సింగపూర్ ప్రధానులతో పాటు పలువురు పారిశ్రామికవేత్తలను పిలిచేందుకు ఏపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. యావ‌త్ ప్ర‌పంచం దృష్టి ఆక‌ర్షించే విధంగా రాజ‌ధాని శంఖ‌స్థాప‌న కార్య‌క్ర‌మం చేప‌ట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు.
First Published:  12 Jun 2015 6:39 PM IST
Next Story