నల్లా బిల్లుతోనూ బ్యాంకు ఖాతా తెరవచ్చు..
బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లలో ఖాతాలను మరింత సులభంగా తెరిచే అవకాశాన్ని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కల్పిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్, టెలిఫోన్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లు, పైప్డ్ గ్యాస్ బిల్లు, నల్లా బిల్లులను కూడా చిరునామా ధృవీకరణ పత్రాలుగా బ్యాంకుకు సమర్పించవచ్చని ఆర్‌బిఐ వెల్లడించింది. అయితే ఈ బిల్లుల కాలపరిమితి రెండు నెలలకు మించకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను బ్యాంకు విడుదల చేసింది. చిరునామా ధృవీకరణ పత్రాల్లో సడలింపులకు వీలుగా […]
BY Pragnadhar Reddy11 Jun 2015 7:15 PM IST
Pragnadhar Reddy Updated On: 12 Jun 2015 5:38 PM IST
బ్యాంకులు ఇతర ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్లలో ఖాతాలను మరింత సులభంగా తెరిచే అవకాశాన్ని భారత రిజర్వు బ్యాంకు (ఆర్‌బిఐ) కల్పిస్తోంది. ఇందులో భాగంగా విద్యుత్, టెలిఫోన్, పోస్ట్‌పెయిడ్ మొబైల్ బిల్లు, పైప్డ్ గ్యాస్ బిల్లు, నల్లా బిల్లులను కూడా చిరునామా ధృవీకరణ పత్రాలుగా బ్యాంకుకు సమర్పించవచ్చని ఆర్‌బిఐ వెల్లడించింది. అయితే ఈ బిల్లుల కాలపరిమితి రెండు నెలలకు మించకూడదని నిబంధన విధించింది. ఈ మేరకు ఒక నోటిఫికేషన్‌ను బ్యాంకు విడుదల చేసింది. చిరునామా ధృవీకరణ పత్రాల్లో సడలింపులకు వీలుగా ప్రభుత్వం మనీలాండరింగ్ నిరోధక చట్టంలో సవరణలు తీసుకువచ్చినట్టు పేర్కొంది.
Next Story