జర నవ్వండి ప్లీజ్ 111
ఒక రైతు పైన దొంగతనం కేసుపెట్టారు. రైతు తన తరపున వాదించడానికి లాయర్‌ని పెట్టుకోవాలని ఒక లాయర్‌ని కలిశాడు. లాయర్ ఆ రైతును చూసి “నువ్వు ఫీజు ఎంత కట్టగలవు?” అన్నాడు. రైతు “లాయర్‌గారూ! నేను పేదవాణ్ణి. నా దగ్గర ఒక ట్రాక్టర్ మాత్రమే ఉంది” అన్నాడు దీనంగా. “నీ దగ్గర ట్రాక్టర్ ఉంటే నువ్వు పేదవాడివెలా అవుతావు? దాన్ని బట్టి నువ్వు బాగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకూ నువ్వు ఏం దొంగిలించావని నీ మీద […]
ఒక రైతు పైన దొంగతనం కేసుపెట్టారు.
రైతు తన తరపున వాదించడానికి లాయర్‌ని పెట్టుకోవాలని ఒక లాయర్‌ని కలిశాడు.
లాయర్ ఆ రైతును చూసి “నువ్వు ఫీజు ఎంత కట్టగలవు?” అన్నాడు.
రైతు “లాయర్‌గారూ! నేను పేదవాణ్ణి. నా దగ్గర ఒక ట్రాక్టర్ మాత్రమే ఉంది” అన్నాడు దీనంగా.
“నీ దగ్గర ట్రాక్టర్ ఉంటే నువ్వు పేదవాడివెలా అవుతావు? దాన్ని బట్టి నువ్వు బాగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతకూ నువ్వు ఏం దొంగిలించావని నీ మీద కేసు పెట్టారు?” అడిగాడు లాయర్.
రైతు “ట్రాక్టర్” అన్నాడు.
—————————————————–
ఒక మార్వాడీ చనిపోయి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళాడు.
యమధర్మరాజు అతన్ని సూటిగా “నిన్ను స్వర్గానికి పంపమంటావా? నరకానికి పంపమంటావా?” అని అడిగాడు.
మార్వాడీ నిశ్చింతగా “ఫరవాలేదు దేవా! మీరు ఎక్కడికి పంపినా నేను లాభసాటిగా వ్యాపారం చేసుకుంటాను” అన్నాడు..!
—————————————————–
ఒక మంత్రిగారిని ఫైనల్ ఫుట్‌బాల్ టోర్నమెంట్‌కు అతిథిగా పిలిచారు.
ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ పూర్తయ్యాక మంత్రిగారిని మాట్లాడమన్నారు.
మంత్రిగారు లేచి గొంతు సవరించుకుని
“ఈసారి కేవలం రెండు టీములే ఫైనల్‌కి రావడం నాకెంతో బాధ కలిగించింది. మనకు వందల కొద్దీ ఫుట్‌బాల్ క్లబ్బులు ఉంటే కేవలం రెండు టీములు మాత్రమే ఫైనల్‌కి రావడం అన్యాయం. వచ్చే సంవత్సరం వీలైనన్ని ఎక్కువ టీములు ఫైనల్‌కి రావడానికి మనం గట్టిగా కృషి చేయాలి” అన్నాడు.