పాలమూరు కన్నా ముందే దిండి ప్రాజెక్టు పూర్తి: కేసీఆర్
పాలమూరు కంటే ముందే దిండి ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాకు నీళ్లు ఇప్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా శివన్నగూడెంలో దిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్ణాణ సమయంలో ఎవరి భూములు పోతాయో వారి భూములకు రూపాయికి ఐదు రూపాయిలు చొప్పున పరిహారం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఆ కుటుంబంలో ఇద్దరు […]
BY Pragnadhar Reddy12 Jun 2015 5:04 PM IST
X
Pragnadhar Reddy Updated On: 12 Jun 2015 5:04 PM IST
పాలమూరు కంటే ముందే దిండి ప్రాజెక్టు పూర్తి చేసి జిల్లాకు నీళ్లు ఇప్పిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు హామీ ఇచ్చారు. నల్గొండ జిల్లా శివన్నగూడెంలో దిండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు నిర్ణాణ సమయంలో ఎవరి భూములు పోతాయో వారి భూములకు రూపాయికి ఐదు రూపాయిలు చొప్పున పరిహారం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని చెప్పారు. ఒకవేళ ఆ కుటుంబంలో ఇద్దరు చదువుకున్నవాళ్లు ఉంటే ఇద్దరికీ ఉద్యోగాలు ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. ఇక్కడ నీళ్లు లేకుండా ప్రాజెక్టులు ఎలా కడతారని ఏపీ నాయకులు అంటున్నారని, వారు చెప్పేవన్ని తప్పుడు మాటలని కేసీఆర్ ఆంధ్రా నేతలపై మండిపడ్డారు. రెండేళ్లలోనే డిండి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన అన్నారు. మన హక్కు మనం తీసుకుందామంటే ఆంధ్రోళ్లు పంచాయితీ పెడుతున్నారని.. ఏపీ మంత్రి దేవినేనిపై ఆయన ధ్వజమెత్తారు. అయినా టీ. ప్రభుత్వం ధైర్యంగా ముందుకు పోయి ప్రాజెక్టు నిర్మిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఇక్కడ భూములు మునిగిపోయిన నిర్వాసితులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించి ఇస్తామని కేసీఆర్ తెలిపారు.
Next Story