Telugu Global
Others

గుడ్డు వెరీగుడ్!

 ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయల సలాడ్ వైపు మొగ్గు చూపడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఈ సలాడ్‌లో ఉడికించిన గుడ్డు ముక్కలు చేరిస్తే పోషకాలు పుష్కలంగా అందుతాయని అంటున్నారు పరిశోధకులు. వీటివల్ల శరీరం కెరొటినాయిడ్స్‌ను చక్కగా శోషించుకుంటుందని ఇటీవలే గుర్తించారు. ఇవి కొవ్వులో కరిగే పోషకాలు. వాటివల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని పరిశోధనలలో తేలింది. రంగురంగుల కూరగాయల సలాడ్‌ను తినడం వల్ల కెరొటినాయిడ్స్‌తో పాటు బీటా కెరొటిన్, జియాంథిన్, లైకోపిన్ వంటివి లభిస్తాయి. ఇవన్నీ శరీరం సరిగా శోషించుకోవాలంటే […]

గుడ్డు వెరీగుడ్!
X
ఆరోగ్యం కోసం పచ్చి కూరగాయల సలాడ్ వైపు మొగ్గు చూపడం ఇటీవలి కాలంలో ఎక్కువయ్యింది. ఈ సలాడ్‌లో ఉడికించిన గుడ్డు ముక్కలు చేరిస్తే పోషకాలు పుష్కలంగా అందుతాయని అంటున్నారు పరిశోధకులు. వీటివల్ల శరీరం కెరొటినాయిడ్స్‌ను చక్కగా శోషించుకుంటుందని ఇటీవలే గుర్తించారు. ఇవి కొవ్వులో కరిగే పోషకాలు. వాటివల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని పరిశోధనలలో తేలింది. రంగురంగుల కూరగాయల సలాడ్‌ను తినడం వల్ల కెరొటినాయిడ్స్‌తో పాటు బీటా కెరొటిన్, జియాంథిన్, లైకోపిన్ వంటివి లభిస్తాయి. ఇవన్నీ శరీరం సరిగా శోషించుకోవాలంటే గుడ్డు చేర్చడం అవసరం. గుడ్డులో ఉండే లిపిడ్ కెరొటినాయిడ్స్ ఈ పనిని చక్కగా నిర్వర్తిస్తాయి. గుడ్డులో ఉండి అమెనో ఆమ్లాలు అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు, బి విటమిన్స్ కూరగాయలలోని పోషక విలువల్ని వృద్ది చేస్తాయి.
First Published:  12 Jun 2015 6:10 AM IST
Next Story