పవన్ కళ్యాణ్ మౌనంగా ఎందుకున్నారు ?
రాజకీయాల్లోకి వస్తూనే.. అవినీతి నాయకులను బట్టలూడదీసి కొట్టాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని తెలంగాణా వాదులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ర్టాల మధ్య నోటుకు ఓటు ఎర కేసు రాజకీయ వేడిని పుట్టించింది. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున 2014ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కూటమిని బలపరిచారు. ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే నిలదీస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి కేసులో నిందితుడంటూ […]
BY sarvi11 Jun 2015 7:10 AM IST
X
sarvi Updated On: 11 Jun 2015 7:11 AM IST
రాజకీయాల్లోకి వస్తూనే.. అవినీతి నాయకులను బట్టలూడదీసి కొట్టాలంటూ అభిమానులకు పిలుపునిచ్చిన జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడున్నారని తెలంగాణా వాదులు ప్రశ్నిస్తున్నారు. రెండు రాష్ర్టాల మధ్య నోటుకు ఓటు ఎర కేసు రాజకీయ వేడిని పుట్టించింది. పవన్ కల్యాణ్ తన జనసేన పార్టీ తరఫున 2014ఎన్నికల్లో బీజేపీ- టీడీపీ కూటమిని బలపరిచారు. ఏపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తే నిలదీస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు అవినీతి కేసులో నిందితుడంటూ తెలంగాణ ప్రభుత్వం కేసులు పెట్టేందుకు సిద్ధమైంది. పవన్ చెబితే టీడీపీకి చాలామంది ఓట్లేశారు. వైఎస్సార్ సీపీ ఓడిపోయేందుకు పవన్ ప్రచారం కూడా కారణమే. మరి అంతటి ప్రభావశీలి ఇప్పుడు ‘మౌనముని’ ఎందుకు అయ్యారని తెలంగాణ ప్రజలు చర్చించుకుంటున్నారు.
టీడీపీకే మద్దతుగా మాట్లాడతారా..?
‘పవన్ బయటకు రారు’. ‘వచ్చినా టీడీపీకే మద్దతుగా మాట్లాడతారని టీఆర్ ఎస్ వై యస్ ఆర్ సీపి అభిమానులనుకుంటున్నారు. కమ్యూనిష్టూలు ఈయన గురించి పట్టించుకోరు. తెలంగాణ గడ్డపై కేసీ ఆర్‌ను గుడ్డలూడదీసి కొడతానని హెచ్చరించిన పవన్ ఈ విషయంలో తప్పకుండా చంద్రబాబుకే అనుకూలంగా మాట్లాడతారని రెండు రాష్ర్టాల ప్రజలు ముందే ఓ నిర్ణయానికి వచ్చారు. రాజధాని కోసం రైతుల భూ సేకరణ విషయంలోనూ ఇలాగే జరిగిందని గుర్తు చేస్తున్నారు. మంగళగిరిలో రైతుల వద్ద ‘భూసేకరణపై పోరాడుతామని’ ఊకదంపుడు ప్రసంగాలు చేశారు. తరువాత రోజు హైదరాబాద్ వచ్చాక చంద్రబాబు చేస్తుంది మంచి కార్యక్రమమేనని కితాబిచ్చారు. ఇలా పవన్ ఒకరోజులో పరస్పర విరుద్ధ ప్రకటనలు చేసి గందరగోళానికి కారణమయ్యారు. ఇదంతా ఆయనకు అందిన స్ర్కిప్టు ప్రకారమే జరిగిందని, ఆయన కేవలం నటిస్తున్నారని ప్రతిపక్షాలు అప్పట్లో దుమ్మెత్తిపోశాయి. ఓటుకు నోటు ఎర కేసులో టీడీపీలోని మరిన్ని పెద్దతలకాయలు వెలుగుచూసే అవకాశాలు పుష్కలమని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైనా పవన్ కనీసం ప్రకటన అయినా విడుదల చేస్తారని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Next Story