Telugu Global
Others

ఆడవారి వయాగ్రాలొచ్చేశాయ్!

మీరు చదివింది నిజమే. ఆడవారికీ వయాగ్రాలు సిద్ధమయ్యాయి. మహిళలలో కామోద్దీపన కలిగించే ఔషధాల కోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాల కోసం ఇటీవలి కాలంలో పరిశోధనలను ముమ్మరం చేశారు. అవి ఓ కొలిక్కి వచ్చాయి. ముందస్తుగా అమెరికాలో ఫిమేల్ వయాగ్రాని మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఔషధం పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ రహితమని చెప్పలేమని అయితే గతంలో వచ్చిన అన్ని ఔషధాల కంటే చాలా మెరుగైనదని డాక్టర్లు […]

ఆడవారి వయాగ్రాలొచ్చేశాయ్!
X
మీరు చదివింది నిజమే. ఆడవారికీ వయాగ్రాలు సిద్ధమయ్యాయి. మహిళలలో కామోద్దీపన కలిగించే ఔషధాల కోసం చాలా కాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేని ఔషధాల కోసం ఇటీవలి కాలంలో పరిశోధనలను ముమ్మరం చేశారు. అవి ఓ కొలిక్కి వచ్చాయి. ముందస్తుగా అమెరికాలో ఫిమేల్ వయాగ్రాని మార్కెట్‌లో అందుబాటులోకి తెచ్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ఈ ఔషధం పూర్తిగా సైడ్ ఎఫెక్ట్స్ రహితమని చెప్పలేమని అయితే గతంలో వచ్చిన అన్ని ఔషధాల కంటే చాలా మెరుగైనదని డాక్టర్లు చెబుతున్నారు. అమెరికాలోని స్ప్రౌట్ ఫార్మాస్యూటికల్స్ ఈ ఔషధాన్ని తయారు చేస్తోంది. అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) ఆమోదముద్ర కూడా లభించింది. ఫ్లిబాన్‌సెరిన్ పేరుగల ఈ ఔషధాన్ని సేవించిన తర్వాత కారు నడపరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి ఫ్లిబాన్‌సెరిన్ అప్రూవల్ కోసం 2010లోనే ఎఫ్‌డీఏ ముందుకు వచ్చింది. అయితే సైడ్ ఎఫెక్ట్స్‌ని పరిమితం చేయాలంటూ ఎఫ్‌డీఏ తోసిపుచ్చింది. ఆ తర్వాత 2013లోనూ మరోమారు ఇది పరిశీలనకు వచ్చినా అనుమతి దక్కలేదు. ఇపుడు అన్ని అనుమతులతో పూర్తిస్థాయి సేఫ్టీ ప్రమాణాలతో మార్కెట్‌లోకి వస్తోంది.
First Published:  11 Jun 2015 2:32 AM IST
Next Story