Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 110

రాజీవ్‌గాంధీ, జియావుల్‌హక్‌ కలుసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ జియావుల్‌ హక్‌ రాజీవ్‌గాంధీతో “నీ హాబీ ఏమిటి?” అని అడిగాడు. రాజీవ్‌గాంధీ “జనం నా మీద వేసిన జోకుల్ని సేకరిస్తాను” అన్నాడు. “మీ హాబీ లేమిటి?” అని జయావుల్‌ని రాజీవ్‌గాంధీ అడిగాడు. జియావుల్‌ నవ్వుతూ “నా మీద జోకులు వేసిన వాళ్ళని సేకరిస్తూ వుంటాను” అన్నాడు. ——————————————————- ఒక మారుమూల పల్లెనించి హైదరాబాదు వచ్చిన రైతు అబిడ్స్‌లో బస్‌ స్టాఫ్‌లో నిల్చుని తనకు కావలసిన బస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. ఒక […]

రాజీవ్‌గాంధీ, జియావుల్‌హక్‌ కలుసుకున్నారు. కబుర్లు చెప్పుకుంటూ జియావుల్‌ హక్‌ రాజీవ్‌గాంధీతో “నీ హాబీ ఏమిటి?” అని అడిగాడు.
రాజీవ్‌గాంధీ “జనం నా మీద వేసిన జోకుల్ని సేకరిస్తాను” అన్నాడు.
“మీ హాబీ లేమిటి?” అని జయావుల్‌ని రాజీవ్‌గాంధీ అడిగాడు.
జియావుల్‌ నవ్వుతూ “నా మీద జోకులు వేసిన వాళ్ళని సేకరిస్తూ వుంటాను” అన్నాడు.
——————————————————-
ఒక మారుమూల పల్లెనించి హైదరాబాదు వచ్చిన రైతు అబిడ్స్‌లో బస్‌ స్టాఫ్‌లో నిల్చుని తనకు కావలసిన బస్‌ కోసం ఎదురుచూస్తున్నాడు.
ఒక కాలేజీ కుర్రాడు కనిపిస్తే
“దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్ళే బస్‌ ఇక్కడ ఆగుతుందాండీ” అని అడిగాడు.
ఆ కుర్రాడు తల ఎగరేసి”యా” అన్నాడు. ఆ రైతుకు అర్ధం కాలేదు. కాసేపటికి టక్‌ చేసి టై కట్టుకున్న మరొకతన్ని చూసి “దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్ళేబస్సు ఇక్క ఆగుతుందాండీ” అన్నాడు.
అతను చులకనగా రైతును చూసి “యా” అన్నాడు.
రైతుకు అర్ధం కాలేదు. అంతా గందరగోళంగా, అయోమయంగా ఉంది. దిక్కుతోచలేదు. అక్కడో సర్దార్జీ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి “దిల్‌సుఖ్‌నగర్‌ బస్‌ ఇక్కడ ఆగుతుందాండీ” అన్నాడు.
సర్దార్జీ “యస్‌ జంటిల్‌మెన్‌! ఆగుతుంది” అన్నాడు.
రైతు “సారూ! “యా” అంటే ఏమిటి? మీరెందుకు యస్‌ జంటిల్‌మెన్‌” అన్నారు? అని తన సందేహం వ్యక్తపరిచాడు.
సర్దార్జీ గంభీరంగా రైతును చూసి “చదువుకున్నవాళ్ళు ఎప్పుడూ యస్‌ జంటిల్‌మెన్‌” అంటారు. చదువురాని మొరటువాళ్ళు “యా” అంటారు” అన్నాడు.
ఐతే మీరు చదువుకున్న వాళ్ళా సారూ! అన్నాడు రైతు వెంటనే సర్దార్జీ “యా” అన్నాడు.
——————————————————-
ఒక సర్దార్జీ రైతు. పాలు మార్కెట్‌కి సప్లై చేసేవాడు.
రోజూ కొద్దిగా డబ్బులు కూడబెట్టి మారుతీకారు కొందామని నిర్ణయించాడు. కానీ ఎక్కువ డబ్బులు కూడబెట్టలేక ఉన్న డబ్బుల్తో ఒక గేదెను కొన్నాడు.

సర్దార్జీ స్నేహితుడు “సర్దార్‌జీ! మారుతీ కారు కొనడం మానేసి గేదెను కొన్నావు? నామోషీ అనిపించదూ? మార్కెట్‌కు గేదెను తోలుకుపోవడం చిన్నతనమనిపించదా? అన్నాడు.
సర్దార్జీ “గేదెనించి పాలను పిండితే నామోషీ ఏముంటుంది? మారుతీకారు నించి పాలు పిండడానికి ప్రయత్నిస్తే నామోషీ కానీ” అన్నాడు.

First Published:  10 Jun 2015 6:33 PM IST
Next Story