ఉద్యోగాల భర్తీకి జులైలో నోటిఫికేషన్: టి-కెబినెట్ నిర్ణయం
ఉద్యోగాల భర్తీకి జులైలో నోటిఫికేషన్లు జారీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలను రూపొందించి స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఇంకా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు 35,250 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు సత్వర అనుమతుల కోసం రైట్ టు క్లియరెన్స్ కు చట్టం రూపొందించాలని నిర్ణయించారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక […]
BY sarvi11 Jun 2015 2:08 AM GMT
X
sarvi Updated On: 11 Jun 2015 2:08 AM GMT
ఉద్యోగాల భర్తీకి జులైలో నోటిఫికేషన్లు జారీ చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణకు మార్గదర్శకాలను రూపొందించి స్థానికులకే అవకాశం కల్పించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీలో ఇంకా అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు 35,250 కోట్లు కేటాయించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. పరిశ్రమలకు సత్వర అనుమతుల కోసం రైట్ టు క్లియరెన్స్ కు చట్టం రూపొందించాలని నిర్ణయించారు. ఫ్లోరైడ్ నిర్మూలన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రంలోని గీత, మత్స్య కార్మికులకు 5 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తూ కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు. కాంట్రాక్టు కార్మికుల్లో స్థానికేతరులు ఎక్కువగా ఉండడంతో వచ్చేనెలలో మార్గదర్శకాలు రూపొందించి స్థానికులకే అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ఎన్నాళ్ల నుంచో ఉద్యోగాల భర్తీ జరగకపోవడంతో అభ్యర్ధుల వయో పరిమితి పెంపుపై వచ్చే వారం మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.
అనాధ బాలలకు తెలంగాణ ప్రభుత్వమే తల్లీ, తండ్రి అని సీఎం కేసీఆర్ తెలిపారు. అనాథ విద్యార్థుల చదువు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కొలిచి గ్రాముల్లో ఆహారం అందించకుండా.. విద్యార్ధుల కడుపు నిండా భోజనం పెడతామన్నారు. రెండు రోజులకోసారి గుడ్డు కూడా ఇచ్చి దేశానికి మార్గదర్శకంగా ఈ పథకాన్ని అమలు చేస్తామని సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగానే మైనారిటీలకు కూడా 10 రెసిడెన్షియల్స్ పాఠశాలలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 25 కోట్ల రూపాయలతో మైనారిటీలకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్ అందించనున్నట్లు కేసీఆర్ తెలిపారు. మరోపక్క రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టి సారించింది. త్వరితగతిన ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. నిజామాబాద్ జిల్లా రుద్రారంలో ఫుడ్ అండ్ సైన్స్ టెక్నాలజీ కాలేజీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.
Next Story