సల్మాన్ సుతిమెత్తని వార్నింగ్
ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం సల్మాన్ కు అలవాటు. మంచయినా చెడయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం కండలవీరుడి నైజం. ఈసారి కూడా అలాంటి పనే చేశాడు సల్మాన్. అభిమానులు ఎవరైనా లక్షల్లో ఫాలో అవుతుంటే.. ఏ హీరోకైనా సంతోషంగానే ఉంటుంది. కానీ సల్మాన్ కు మాత్రం అస్సలు సంతోషం లేదు. అందుకే తన అభిమానులకు సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చాడు. “నేను ఒక ట్వీట్ చేయడానికి చాలా కష్టపడతారు. అన్ని పనులు అయ్యాక […]
BY admin11 Jun 2015 5:25 AM IST
X
admin Updated On: 11 Jun 2015 5:25 AM IST
ఉన్నది ఉన్నట్టు మాట్లాడ్డం సల్మాన్ కు అలవాటు. మంచయినా చెడయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడ్డం కండలవీరుడి నైజం. ఈసారి కూడా అలాంటి పనే చేశాడు సల్మాన్. అభిమానులు ఎవరైనా లక్షల్లో ఫాలో అవుతుంటే.. ఏ హీరోకైనా సంతోషంగానే ఉంటుంది. కానీ సల్మాన్ కు మాత్రం అస్సలు సంతోషం లేదు. అందుకే తన అభిమానులకు సుతిమెత్తని వార్నింగ్ ఇచ్చాడు.
“నేను ఒక ట్వీట్ చేయడానికి చాలా కష్టపడతారు. అన్ని పనులు అయ్యాక చాలా ఫ్రీ అనుకున్నప్పుడు మాత్రమే ట్వీట్ చేస్తాను. అలాంటి ఒక్క ట్వీట్ కు లక్షల్లో ఫాలోవర్స్ వస్తుంటారు. ఒక్కోసారి నా ట్వీట్సే ట్రెండింగ్ అవుతుంటాయి. నిజంగా మీరు అంత ఖాళీగా ఉన్నారా.. నా ట్వీట్స్ కు రీట్వీట్ చేయడమే మీ పనా.. మీకు ఇంతకంటే పెద్ద పని ఇంకోటి లేదా.. మీరు నిజంగా అంత ఖాళీగా ఉంటారు.. రీట్వీట్స్ చేసే పనిని వీకెండ్స్ లో పెట్టుకోండి బాస్.. నిత్యం బిజీగా ఉండడానికి ప్రయత్నించండి.. ఏదో ఒక పని చేయండి.”
ఇది సల్మాన్ ఖాన్ మెసేజ్ సారాంశం. ఎప్పుడూ తననే ఫాలో అవుతూ టైమ్ వేస్ట్ చేసుకోవద్దని సున్నితంగా ఫ్యాన్స్ ను హెచ్చరించాడు సల్మాన్. తన కోసం కేటాయించే టైమ్ ను మరొక పనికి కేటాయిస్తే ఎంతో బాగుంటుందని సూచించాడు. ఎంతమంది హీరోలు ఇలాంటి మెసేజులు ఇవ్వగలరు చెప్పండి.
Next Story