రానా తన సినీ ప్రస్థానంపై హ్యాపీగా లేడా?
దగ్గుబాటి రానా. మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్, స్ఫురధౄపం, తెలుగు తమిళ, హిందీ ఇండస్ట్రీలన్నింటిలో సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది మనకు. కాని రానాకి మాత్రం తన బాలివుడ్ కెరియర్‌పైన అంత సంతృప్తి లేదట. ఇక్కడ తెలుగు తమిళ్‌లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ద్విభాషా చిత్రాలు చేస్తూ సౌత్ ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాడు. కాని బాలివుడ్‌లో మాత్రం ఈ మధ్య స్పెషల్ అప్పియెరెన్స్‌లు మినహా ప్రామిసింగ్‌గా ఏమీ లేవని బాధపడుతున్నాడు మన రానా. కానీ అన్ని […]
దగ్గుబాటి రానా. మంచి సినిమా బ్యాక్ గ్రౌండ్, స్ఫురధౄపం, తెలుగు తమిళ, హిందీ ఇండస్ట్రీలన్నింటిలో సినిమాలు చేస్తున్నాడు. ఇంకా ఏం కావాలి అనిపిస్తుంది మనకు. కాని రానాకి మాత్రం తన బాలివుడ్ కెరియర్‌పైన అంత సంతృప్తి లేదట. ఇక్కడ తెలుగు తమిళ్‌లో ‘బాహుబలి’, ‘రుద్రమదేవి’ వంటి ద్విభాషా చిత్రాలు చేస్తూ సౌత్ ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నాడు. కాని బాలివుడ్‌లో మాత్రం ఈ మధ్య స్పెషల్ అప్పియెరెన్స్‌లు మినహా ప్రామిసింగ్‌గా ఏమీ లేవని బాధపడుతున్నాడు మన రానా.
కానీ అన్ని చోట్ల ఒక్కసారే అన్ని పనులు చేయడం కుదరదని తెల్సుకున్నానని, కనుక అన్ని ఇండస్ట్రీస్‌కి పనికి వచ్చే ‘బాహుబలి’ వంటి సబ్జెక్ట్స్ ఎన్నుకుంటే, ఒకేసారి అందరినీ మెప్పించవచ్చని అర్థం అయ్యిందని చెపుతున్నాడు మన దగ్గుబాటి వారబ్బాయి. ఆల్‌రెడీ తమిళ్‌లో రెండు ప్రాజెక్ట్‌లు మొదలయ్యాయి. ‘బాహుబలి’ అతని హిందీ ప్రస్థానం నిర్ణయిస్తుంది. ఇక తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అతనికి ఇల్లు లాంటిది. ఇక్కడ దగ్గుబాటి వారబ్బాయికి చాన్సుల కొదవ ఏముంది స్వంత బ్యానర్ ఉండగా!! ఏమంటారు?