రచయితలకు తెలుగు యూనివర్సిటీ సాయం
తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, చరిత్ర, జానపద విజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన రచనల్ని పుస్తక రూపంలో ముద్రించుకునేందుకు రచయితలకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆర్థిక సహాయం అందిస్తోంది. రచనలు… తెలుగు భాషా సాహిత్యాలు, కళా సంస్కృతులపై తెలుగులో కాని ఇతర భాషల్లో ఉన్నా సాయానికి అర్హమవుతాయని రిజిస్ట్రార్ ఆచార్య కె. తోమాసయ్య ఓ ప్రకటనలో తెలిపారు. వివరాలకు www.teluguuniversity.ac.in వెబ్‌సైట్‌లో చూడవచ్చు.