రెండు రాష్ట్రాల మధ్య గొడవలు రేగాలనుకుంటున్నారా?
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ ఎస్, వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటే రెండు రాష్ర్టాల ప్రజల మధ్య గొడవలు రేగాలని బలంగా కోరుకుంటున్నట్లు ఉందని ఆరోపిస్తున్నారు. ఆంధ్ర ప్రజల ఇళ్లపై తెలంగాణ వాళ్లు దాడులు చేశారని, తెలంగాణలోని ఆంధ్రులను బెదిరిస్తున్నారని, అధికారులను కూడా బెదిరిస్తున్నారంటూ బాబు చేసినవి అర్థం పర్థం లేని ఆరోపణలని విమర్శిస్తున్నారు. నిజానికి అలాంటి పరిస్థితి గానీ, ఘటనలు గానీ ఏడాదికాలంలో ఎన్నడూ జరిగిన […]
BY sarvi11 Jun 2015 7:09 AM IST
X
sarvi Updated On: 11 Jun 2015 7:12 AM IST
ఢిల్లీ పర్యటన సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై టీఆర్ ఎస్, వైఎస్సార్ సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఆయన మాటలు చూస్తుంటే రెండు రాష్ర్టాల ప్రజల మధ్య గొడవలు రేగాలని బలంగా కోరుకుంటున్నట్లు ఉందని ఆరోపిస్తున్నారు. ఆంధ్ర ప్రజల ఇళ్లపై తెలంగాణ వాళ్లు దాడులు చేశారని, తెలంగాణలోని ఆంధ్రులను బెదిరిస్తున్నారని, అధికారులను కూడా బెదిరిస్తున్నారంటూ బాబు చేసినవి అర్థం పర్థం లేని ఆరోపణలని విమర్శిస్తున్నారు. నిజానికి అలాంటి పరిస్థితి గానీ, ఘటనలు గానీ ఏడాదికాలంలో ఎన్నడూ జరిగిన దాఖలాలే లేవు. ప్రజల మధ్య గొడవలు పెట్టి, విషయాన్ని పక్కదారి పట్టించాలని ప్రయత్నిస్తున్నారని హైదరాబాద్ ప్రజలు మండిపడుతున్నారు. సీఎం పదవిలో ఉండి ఇలాంటి దిగజారుడు వ్యాఖ్యలు చంద్రబాబుకు తగవని హితవు పలుకుతున్నారు. హైదరాబాద్ లో దేశంలోని అన్ని మతాలు, కులాలు, విదేశీయులు నివసిస్తున్నారు. అందరూ కలిసి సామరస్యంగా జీవిస్తున్నారు. చంద్రబాబు ఇలాంటి చవకబారు వ్యాఖ్యలు చేసి తన ప్రతిష్టను తానే దిగజార్చుకుంటున్నారని అభిప్రాయపడుతున్నారు. తనకు అంటిన మసిని ప్రజలకు అంటించే ప్రయత్నాలు మానుకోవాలని సూచిస్తున్నారు. మరికొందరు ఆయనకు అరెస్టు భయం పట్టుకుందని అందుకే మానసిక ఒత్తిడిలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని జాలిపడుతున్నారు.
Next Story