గోదావరి పుష్కరాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా పుష్కర ఏర్పాట్లపై సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం రూ.1,295 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ.244.15 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు సీఎంకు తెలిపారు. అలాగే రూ.701.52 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలు..రోడ్‌కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఎంకు వివరించారు. రాజమండ్రిలో 1600 తాత్కాలిక […]
BY sarvi10 Jun 2015 1:18 PM GMT
sarvi Updated On: 11 Jun 2015 6:22 AM GMT
గోదావరి పుష్కరాలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా పుష్కర ఏర్పాట్లపై సీఎంకు అధికారులు వివరించారు. మొత్తం రూ.1,295 కోట్లతో చేపట్టిన పనుల్లో ఇప్పటి వరకు రూ.244.15 కోట్ల విలువైన పనులు పూర్తి అయినట్లు సీఎంకు తెలిపారు. అలాగే రూ.701.52 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంతాలు..రోడ్‌కమ్ రైల్వే బ్రిడ్జ్ దగ్గర సుందరీకరణ పనులు జరుగుతున్నాయి. 400 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు సీఎంకు వివరించారు. రాజమండ్రిలో 1600 తాత్కాలిక మరుగుదొడ్లను ఏర్పాట్లు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఐదు సెంటర్లలో వైఫై సెంటర్లు ఏర్పాటు చేయాలన్నారు.
Next Story