జీహెచ్‌ఎంసీ వాహనానికి రూ.8 వేల చలాన్
జీహెచ్‌ఎంసీని వాహనాల చలాన్ల ఆందోళన వెంటాడుతోంది. ఓ సూపరింటెండెంట్ ఇంజనీర్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడంతో అధికారుల మేల్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్ వంటి కారణాలతో ఓ ఎస్‌ఈ వినియోగించే జీహెచ్‌ఎంసీకి చెందిన బొలేరో వాహనానికి రూ. 8 వేల చలాన్ పెండింగ్‌లో ఉంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని బుధవారం సీజ్ చేశారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చ జరిగింది. ఒకే వాహనానికి 8వేల చలాన్ ఉందంటే.. సంస్థకు చెందిన దాదాపు 300 […]
BY sarvi10 Jun 2015 1:17 PM GMT
sarvi Updated On: 11 Jun 2015 6:18 AM GMT
జీహెచ్‌ఎంసీని వాహనాల చలాన్ల ఆందోళన వెంటాడుతోంది. ఓ సూపరింటెండెంట్ ఇంజనీర్ వాహనాన్ని ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేయడంతో అధికారుల మేల్కొన్నారు. సిగ్నల్ జంపింగ్, రాంగ్ సైడ్ పార్కింగ్ వంటి కారణాలతో ఓ ఎస్‌ఈ వినియోగించే జీహెచ్‌ఎంసీకి చెందిన బొలేరో వాహనానికి రూ. 8 వేల చలాన్ పెండింగ్‌లో ఉంది. ట్రాఫిక్ పోలీసులు వాహనాన్ని బుధవారం సీజ్ చేశారు. దీనిపై ఉన్నతస్థాయి అధికారుల్లో చర్చ జరిగింది. ఒకే వాహనానికి 8వేల చలాన్ ఉందంటే.. సంస్థకు చెందిన దాదాపు 300 వాహనాలకు ఎంత మొత్తం ఉంటుందో అని ఆందోళన చెందుతున్నారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కల్పించే చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
Next Story