పాలమూరు ఎత్తిపోతలకు అనుమతేది? : దేవినేని
తెలంగాణ ప్రభుత్వం చేపట్టదలచిన పాలమూరి-రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఎలా చేస్తారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం కేసీఆర్ పీకల్లోతు కూరుకుపోయారని […]
BY Pragnadhar Reddy11 Jun 2015 5:04 PM IST
X
Pragnadhar Reddy Updated On: 11 Jun 2015 5:04 PM IST
తెలంగాణ ప్రభుత్వం చేపట్టదలచిన పాలమూరి-రంగారెడ్డి, నక్కలగండి ప్రాజెక్టుకు ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన ఎలా చేస్తారని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ప్రశ్నించారు. కృష్ణా జలాల వినియోగంపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. దీనికి సంబంధించి ఆ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సీఎం కేసీఆర్ పీకల్లోతు కూరుకుపోయారని అన్నారు. ఈ అంశంపై ప్రజల దృష్టిని మళ్లించేందుకే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేసీఆర్ శంకుస్థాపన చేశారని విమర్శించారు. ఆంధ్రా కళ్లు పొడుద్దామనుకున్న కేసీఆర్.. ఖమ్మం, నల్గొండ జిల్లాల రైతాంగం కళ్లు పొడుస్తున్నారని విమర్శించారు. రాజ్యాంగానికి లోబడే ప్రాజెక్టుల నిర్మాణం జరగాలని అన్నారు. అయితే కేసీఆర్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ విభజన చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఎలాంటి అనుమతి లేకుండా తెలంగాణలో ప్రాజెక్టులు కడుతుంటే వైసీపీ అధినేత, ప్రతిపక్ష నేత జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని దేవినేని ప్రశ్నించారు.
Next Story