పెట్రోల్ బంక్ లో పేలుడు: 200 మంది మృతులు
అంకారాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో తలదాచుకునేందుకు పెట్రోల్ బంక్‌ను ఆశ్రయించిన బాధితులకు మృత్యువు మరో దారిలో కబళించింది. బాధితులు పెట్రోల్ బంక్‌లో ఆశ్రయం పొందుతున్న సమయంలో భూగర్భంలోని అయిల్ ట్యాంకర్లో నిల్వ ఉంచిన చమురు లీకైంది. దాంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బంక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్నికీలలు అక్కడ తలదాచుకుంటున్న బాధితుల్ని చుట్టుముట్టేశాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 200 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ […]
BY sarvi10 Jun 2015 6:38 PM IST
sarvi Updated On: 11 Jun 2015 6:18 AM IST
అంకారాలో భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలకు వరదలు సంభవించాయి. దీంతో తలదాచుకునేందుకు పెట్రోల్ బంక్‌ను ఆశ్రయించిన బాధితులకు మృత్యువు మరో దారిలో కబళించింది. బాధితులు పెట్రోల్ బంక్‌లో ఆశ్రయం పొందుతున్న సమయంలో భూగర్భంలోని అయిల్ ట్యాంకర్లో నిల్వ ఉంచిన చమురు లీకైంది. దాంతో పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి బంక్‌లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ అగ్నికీలలు అక్కడ తలదాచుకుంటున్న బాధితుల్ని చుట్టుముట్టేశాయి. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 200 ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ అగ్నికీలలు పెట్రోల్ బంక్ పరిసర ప్రాంతాల్లో భవనాలకు వ్యాపించి చుట్టుపక్కల ఉన్నవారు కూడా ఇందులో సమిధలైపోయారు. మొదటి చనిపోయిన వారు దాదాపు 75 మంది వరకు ఉంటారని భావించారు. కాని తర్వాత నెమ్మది ఈ సంఖ్య 200కు చేరుకుంది. ఈ పేలుడులో గాయపడిన క్షతగాత్రులు నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఈ ఘటనతో ఘనాలో విషాద ఛాయలు అలముకున్నాయి. దేశంలో మూడురోజులు సంతాప దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. మృతుల సంఖ్య పెరుగుతున్న క్రమంలో దేశాధ్యక్షుడు జాన్ డ్రమని మహమా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. కొనసాగుతున్న సహయక చర్యలపై ఆయన ఆరా తీశారు. సహయక చర్యలు మరింత వేగవంతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. మౌలిక సదుపాయాల కల్పన సహాయక చర్యల కోసం రూ. 12 మిలియన్ల యూఎస్ డాలర్లు కేటాయించినట్లు మహమా ఈ సందర్భంగా వెల్లడించారు.
Next Story